హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వేసే లవంగాలు.. ఎలా వాడాలంటే?

లవంగాలు.వీటి గురించి పరిచయాలు అవసరం లేదు.

మన ఇండియన్ స్పైసెస్ లో లవంగాలు( Cloves ) ఒకటి.

చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపించే లవంగాలు.

ఘాటైన రుచి, వాసన కలిగి ఉంటాయి.మాంసాహారం, బిర్యానీ, పులావ్ వంటి వంటకాల్లో లవంగాలను కచ్చితంగా వేస్తుంటారు.

వంటలకు రుచితో పాటు ఆరోగ్యపరంగా కూడా లవంగాలు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.అలాగే జుట్టు సంరక్షణకు కూడా లవంగాలు ఉపయోగపడతాయిముఖ్యంగా హెయిర్ ఫాల్ సమస్యకు అడ్డుకట్ట వేయడానికి లవంగాలు అద్భుతంగా హెల్ప్ చేస్తాయి.

Advertisement
How To Stop Hair Fall With Cloves , Cloves, Cloves Oil, Hair Fall , Sto

మనలో హెయిర్ ఫాల్ సమస్యతో సతమతం అవుతున్న వారు ఎంతో మంది ఉన్నారు.జుట్టు రాలడాన్ని ఎలా ఆపాలో తెలియక తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

కానీ అందరి ఇంట్లో ఉండే లవంగాలతో సులభంగా మరియు వేగంగా హెయిర్ ఫాల్ సమస్యను దూరం చేసుకోవచ్చు.మరి ఇంతకీ లవంగాలను ఎలా వాడాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

How To Stop Hair Fall With Cloves , Cloves, Cloves Oil, Hair Fall , Sto

ముందు పది నుంచి పదిహేను లవంగాలను మెత్తగా దంచి పొడి చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్‌ తీసుకుని అందులో ఒక కప్పు కొబ్బరి నూనె ( coconut oil )వేసుకోవాలి.అలాగే నాలుగు టేబుల్ స్పూన్లు ఆముదం, ( Castor oil )దంచి పెట్టుకున్న లవంగాల పొడిని వేసి మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో ఉంచి డబుల్ బాయిలర్ మెథడ్ లో 15 నిమిషాల పాటు హీట్ చేయాలి.ఆపై ఆయిల్ ను చల్లారబెట్టుకుని ఒక బాటిల్ లో నింపుకోవాలి.

How To Stop Hair Fall With Cloves , Cloves, Cloves Oil, Hair Fall , Sto
పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

నైట్ నిద్రించేముందు ఈ లవంగాల నూనెను స్కాల్ప్ కు బాగా అప్లై చేసుకొని కనీసం 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.మరుసటి రోజు మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ నూనెను వాడితే హెయిర్ ఫాల్ ( Hair Fall )అన్న మాటే అనరు.

Advertisement

జుట్టు రాలడాన్ని ఈ లవంగాల నూనె చాలా సమర్థవంతంగా అరికడుతుంది.అలాగే కుదుళ్లను బలోపేతం చేసి హెయిర్ గ్రోత్ ను సైతం ఇంప్రూవ్ చేస్తుంది.

తాజా వార్తలు