బ‌ట్ట‌ల‌పై మ‌ర‌క‌లు పోవ‌డం లేదా..అయితే ఈ టిప్స్ మీకే?

తినేట‌ప్పుడో, ఏదైనా ప‌ని చేసేట‌ప్పుడో, టీ, కాఫీ తాగేట‌ప్పుడో బ‌ట్ట‌ల‌పై మ‌ర‌క‌లు ప‌డుతూ ఉంటాయి.అయితే కొన్ని కొన్ని మ‌ర‌క‌లు ఎంత ఉతికినా పోనే పోవు.

దాంతో ఎంత ఖ‌రీదు చేసే బ‌ట్ట‌లైనా.మ‌ర‌క‌ల వ‌ల్ల‌ చెండాలంగా క‌నిపిస్తాయి.

అందులోనూ తెల్ల బ‌ట్ట‌లైతే.ప్ర‌త్యేకంగా వివ‌రించాల్సిన ప‌ని లేదు.

అయితే కొన్ని కొన్ని సింపుల్ టిప్స్ ను పాటిస్తే.బ‌ట్ట‌ల‌పై సుల‌భంగా మ‌ర‌క‌ల‌ను వ‌దిలించుకోవ‌చ్చు.

Advertisement

మ‌రి ఆ టిప్స్ ఏంటో ఆలస్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.బ‌ట్ట‌ల‌పై ఉన్న మొండి మ‌ర‌క‌ల‌ను మ‌టుమాయం చేయ‌డంలో వెనిగ‌ర్ అద్భుతంగా స‌మాయ‌ప‌డుతుంది.

మ‌ర‌క‌లు ఉన్న ప్రాంతంలో కొద్దిగా వెనిగ‌ర్ వేసి బాగా ర‌బ్ చేసి.అనంత‌రం సోప్‌తో క్లీన్ చేయాలి.

ఇలా చేస్తే మ‌ర‌క‌లు ఇట్టే పోతాయి.అలాగే బంగాళ‌దుంపతో కూడా బ‌ట్ట‌ల‌పై ప‌డ్డ మ‌ర‌క‌ల‌ను నివారించ‌వ‌చ్చు.

ముందుగా బంగాళ దుంప నుంచి ర‌సం తీసుకుని.దాన్ని మ‌ర‌క‌లు ఉన్న చోటు వేసి బాగా రుద్దాలి.

నాకు అవార్డు రాకుండా రాజకీయం చేశారు.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!
అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!

ఆ త‌ర్వాత కొంత స‌మ‌యం పాటు డిట‌ర్జెంట్ లో నాన బెట్టి క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

Advertisement

బట్ట‌ల‌పై మ‌ర‌క‌లు ఉన్న చోట కొద్దిగా బేకింగ్ పౌడ‌ర్ మ‌రియు నిమ్మ ర‌సం వేసి రెండు లేదా మూడు నిమిషాల పాటు ర‌బ్ చేయాలి.అనంత‌రం వేడి నీటిలో కొద్ది స‌మ‌యం పాటు నాన బెట్టి.ఇప్పుడు సోప్‌తో క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేస్తే మ‌ర‌క‌లు పోతాయి.ఇక శీకాయపొడితో బ‌ట్ట‌ల‌పై ప‌డ్డ మ‌ర‌క‌ల‌ను సులువుగా పోగొట్టుకోవ‌చ్చు.

ముందుగా శీకాయ‌పొడిలో కొద్దిగా వాటర్ మీక్స్ చేసి.దాన్ని మ‌ర‌క‌లు ఉన్న చోటు వేసి రుద్దాలి.

ఆ త‌ర్వాత వేడినీటితో బ‌ట్ట‌ల‌ను శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా చేసినా బ‌ట్ట‌ల‌పై ఉన్న మ‌ర‌క‌లు పూర్తిగా తొల‌గిపోతాయి.

తాజా వార్తలు