Phone Screen Scratches: స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌పై గీతలను చెరిపేయండిలా

స్మార్ట్ ఫోన్‌ను చాలా మంది అపురూపంగా చూసుకుంటారు.అయితే వాడే కొద్దీ ఫోన్ స్క్రీన్‌పై గీతలు పడతాయి.

స్క్రీన్ చూసి చాలా మంది దిగులుగా ఉంటారు.చివరికి స్క్రీన్ గార్డ్‌ మార్చేస్తారు.

ఉదాహరణకు మీరు Apple ఐఫోన్ కలిగి ఉంటే మీ స్క్రీన్‌ రీప్లేస్ చేయడానికి యాపిల్ 29 డాలర్లు మాత్రమే వసూలు చేస్తుంది.మీ వారంటీ గడువు ముగిసినట్లయితే, స్క్రీన్‌ను మార్చడానికి యాపిల్ ఫోన్లకు 129 నుంచి 149 డాలర్లు ఖర్చవుతుంది.

ఫోన్‌ కంపెనీలను బట్టి ఇంత ధర ఉంటుంది.స్క్రీన్ రీప్లేస్ కాకుండా, స్క్రీన్ గార్డ్ రీప్లేస్ చేసి చాలా మంది సరిపెట్టుకుంటారు.దానికి కూడా రూ.300ల వరకు ఖర్చవుతుంది.అయితే కొన్ని టిప్స్‌తో ఖర్చు లేకుండా మీ స్క్రీన్ చక్కగా తయారు చేసుకోవచ్చు.

Advertisement
How To Remove Scratches From Your Smart Phone Screen Details, Smart Phone, Tech

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.మీ ఫోన్ స్క్రీన్‌పై చిన్న గీతలను నయం చేయడానికి మీ టూత్ పేస్టును తీసుకోండి.

అయితే జెల్ తరహా టూత్ పేస్ట్ కాకుండా సాధారణ రకం టూత్ పేస్టును ఎంచుకోవాలి.శుభ్రమైన, మృదువైన కాటన్ క్లాత్ తీసుకుని, దానికి చివర టూత్‌పేస్ట్‌ను చిన్న మొత్తంలో రాయండి.

దానిని ఫోన్ స్క్రీన్ పై గీతలు పోయే వరకు కనీసం 5 నిమిషాలు వృత్తాకార పద్ధతిలో మసాజ్ చేసినట్లు సున్నితంగా రుద్దాలి.ఆ తర్వాత తడి గుడ్డతో స్క్రీన్ ను స్లోగా తుడవాలి.

How To Remove Scratches From Your Smart Phone Screen Details, Smart Phone, Tech

ఆ తర్వాత చూస్తే మీ స్క్రీన్ ఇంతకు ముందు కంటే మెరుగ్గా ఉంటుంది.గీతలు చాలా వరకు పోతాయి.బేబీ పౌడర్‌లో నీటిని పోస్తే అది పేస్ట్ మాదిరిగా తయారు అవుతుంది.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
బాన పొట్టను 20 రోజుల్లో ఫ్లాట్ గా మార్చే బెస్ట్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ మీ కోసం!

దానితో క్లాత్ తీసుకుని దానిని ఫోన్ స్క్రీన్ పై రుద్దాలి.బేకింగ్ సోడా కూడా వాడినా ఇదే పలితం ఉంటుంది.

Advertisement

అయితే నీరు ఫోన్ లోపలికి పోకుండా జాగ్రత్త పడాలి.వెజిటబుల్ ఆయిల్ తీసుకుని, కొంచెం కొంచెంగా స్క్రీన్ పై చుక్కలు వేసి, స్లోగా రుద్దాలి.

ఈ టిప్స్ తో మీ ఫోన్ స్క్రీన్ ఇంతకు ముందు కంటే మెరుగ్గా కనపడుతుంది.చాలా వరకు స్క్రీన్ పై గీతలు మాయం అవుతాయి.

తాజా వార్తలు