జలుబును తరిమి తరిమి కొట్టే మెంతులు.. ఎలా వాడాలో తెలుసా?

ప్రస్తుత వర్షాకాలంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది జలుబు సమస్య( Cold )తో సతమతం అవుతున్నారు.

జలుబు వచ్చింది అంటే వెంటనే దగ్గు కూడా పట్టుకుంటుంది.

ఇవి చాలా చిన్న సమస్యలే అయినప్పటికీ వీటితో వేగ‌డం చాలా కష్టం.జలుబు, ద‌గ్గు వల్ల ఏ పని చేయలేకపోతుంటారు.

ఏకాగ్రత దెబ్బతింటుంది.చికాకుగా అనిపిస్తుంది.

ఈ క్రమంలోనే జలుబు, దగ్గు సమస్యలను వదిలించుకునేందుకు మందులు వాడుతుంటారు.కానీ సహజంగా కూడా వీటి నుంచి బయటపడవచ్చు.

How To Relief From Cold With Fenugreek Seeds, Cold, Cold Relief Remedy, Cold An
Advertisement
How To Relief From Cold With Fenugreek Seeds!, Cold, Cold Relief Remedy, Cold An

జలుబును తరిమి తరిమి కొట్టడానికి వంటింట్లో ఉండే మెంతులు( Fenugreek Seeds ) అద్భుతంగా తోడ్పడతాయి.మెంతుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ నిండి ఉంటాయి.అందువల్ల మెంతులు జలుబును సమర్థవంతంగా నివారిస్తాయి.

మరి ఇంతకీ మెంతులు ఎలా తీసుకుంటే త్వరగా జ‌లుబు తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు, ఒక చిన్న కప్పు వాటర్ పోసి గంట పాటు నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో నానబెట్టుకున్న మెంతులను నీటితో సహా వేసి మరిగించాలి.

ఆల్మోస్ట్ వాటర్ సగం అయ్యేంతవరకు బాయిల్ చేయాలి.

How To Relief From Cold With Fenugreek Seeds, Cold, Cold Relief Remedy, Cold An
వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని కొద్దిగా తేనె కలిపి సేవించాలి.ఇలా రోజుకు రెండు సార్లు కనుక చేస్తే జలుబు ఎంత తీవ్రంగా ఉన్నా సరే ఎగిరిపోతుంది.అలాగే దగ్గు సమస్య సైతం దూరం అవుతుంది.

Advertisement

పైగా నిత్యం ఈ మెంతి వాటర్( Fenugreek Water ) ను తీసుకుంటే డైజీషన్ మెరుగ్గా సాగుతుంది.మల‌బద్ధకం సమస్య ఉంటే దూరం అవుతుంది.

వెయిట్ లాస్ అవుతారు.మరియు బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది.

మునుపటి కంటే చురుగ్గా మీ మెదడు పనిచేస్తుంది.

తాజా వార్తలు