కళ్ళ అలసట తగ్గించటానికి....ఇంటి చిట్కాలు

నిద్ర సరిగా లేనప్పుడు,పని ఎక్కువగా చేసినప్పుడు, ప్రయాణాల సమయంలో కళ్ళు అలసటకు గురి అవుతాయి.

అలాంటి సమయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్ లో కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

అందువల్ల ఈ చిన్న చిన్న చిట్కాలను ఫాలో అవ్వాలి.పడుకోవటానికి ముందు తప్పనిసరిగా కళ్ళను శుభ్రం చేసుకోవాలి.

How To Reduce Eye Strain-How To Reduce Eye Strain-Telugu Health-Telugu Tollywood

బయట నుంచి ఇంటికి రాగానే ముందుగా కళ్ళను కడుక్కోవాలి.అలాగే రాత్రి పడుకొనే ముందు చల్లని నీటితో ముఖాన్ని కడుక్కుంటే ముఖం తాజాగా ఉంటుంది.

కొన్ని సార్లు కళ్ళు బాగా అలిసినప్పుడు కనురెప్పలు వాలిపోతాయి.అటువంటి సమయంలో కళ్ళ మీద చల్లని టీ బ్యాగ్స్ పెట్టుకుంటే అలసట తగ్గుతుంది.

Advertisement

ఈ విధంగా ప్రయాణం చేసి వచ్చినప్పుడు మరియు ఎండలో బయటకు వెళ్లి వచ్చినప్పుడు పెట్టుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.ఐ బాత్ కూడా అలసట నుండి ఉపశమనం కలిగిస్తుంది.

కంటికి స్నానం ఏమిటా అని ఆలోచిస్తున్నారా? ఒక బౌల్ నిండా నీళ్లు పోసి కళ్ళు బాగా తెరచి ముఖాన్ని బౌల్ లో ముంచితే కంటిలో ఉన్న దుమ్ము,ధూళి అంతా బయటకు వచ్చేస్తుంది.కీరదోస ముక్కలను కళ్ళ మీద పెట్టుకున్న అలసిన కళ్ళకు మంచి ఉపశమనం కలుగుతుంది.

Advertisement

తాజా వార్తలు