అరటి పంటను ఆశించే బొగ్గు కాడ కుళ్ళు తెగులను అరికట్టే పద్దతులు..!

అరటి పంటను( Banana Crop ) ఆశించే బొగ్గు కాడ కుళ్ళు తెగుళ్లు ఒక ఫంగస్( Fungus ) వల్ల పంటను ఆశిస్తాయి.

పొడి వాతావరణంలో ఈ తెగుళ్ల వ్యాప్తి అధికంగా ఉంటుంది.

ఈ ఫంగస్ భూమిలో ఉండే పంట అవశేషాలలో దాదాపుగా మూడు సంవత్సరాల పాటు జీవించి ఉంటుంది.అరటి చెట్ల వేర్లపై ఇవి దాడి చేయడం వల్ల మొక్కలకు నీరు మరియు పోషకాలు సరిగ్గా అందవు.

దీంతో మొక్కలు క్షీణించడం మొదలవుతుంది.ఈ ఫంగస్ వేర్లపై దాడి చేసి క్రమంగా అరటి మొక్క కాండాలపైకి వ్యాపిస్తుంది.

అరటి మొక్క కాండం, అంతర్గత కణజాలాలపై నల్లటి మచ్చలు( Black Spots ) గమనించవచ్చు.నల్లటి ఫంగస్ స్పెక్స్ తో గట్టి పీచు కణజాలు కణుపులపై కనిపిస్తాయి.

Advertisement

దీంతో మొక్కలు తొందరగా ఎదిగి బలహీనమైన కాడలు కలిగి ఉంటాయి.అరటి మొక్క ఆకులు( Banana Leaves ) పసుపు రంగులోకి మారి ఎండిపోయి చనిపోతాయి.

తెగుల వ్యాప్తి అధికంగా ఉంటే సుమారుగా సగానికి పైగా మొక్కలు విరిగిపోతాయి.

మరి ఈ తెగులు పంటను ఆశించకుండా ఉండాలంటే.కరువును, నీటి ఎద్దడిని తట్టుకునే విత్తన రకాలు ఎంచుకొని సాగు చేయాలి.మొక్కకు పూత, పిందే దశలో పొడి వాతావరణం లేకుండా ఉండేటట్లు నాట్ల సమయాన్ని ఎంచుకోవాలి.

మొక్కల మధ్య దూరం ఉండేటట్లు నాటుకోవాలి.పూత అనంతర దశలో నీరు పెట్టి నేలలో అధిక తేమ( Moisture ) ఉండేటట్లు చూడాలి.

ఈ తెగులు సోకని మొక్కల రకాలతో పంట మార్పిడి చేయాలి.

Advertisement

పంట కోత( Harvesting ) తరువాత పొలాన్ని లోతుగా దున్ని పంట అవశేషాల్ని పాతిపెట్టాలి.మట్టిని సూర్యరశ్మి బాగా తగిలేటట్లు దున్నాలి.ఒక హెక్టారు భూమికి 18 కిలోల మ్యురేట్ ఆఫ్ పొటాష్ ను ఉపయోగించడం వల్ల మొక్కలు దృఢంగా మారి ఈ ఫంగస్ను తట్టుకునే సామర్థ్యాన్ని పొందుతాయి.

సేంద్రియ పద్ధతిలో వేప నూనె పదార్థాలు, ఆవపిండి కేక్ వంటి పదార్థాలను ఉపయోగించి ఈ తెగుళ్లను వ్యాప్తి చెందకుండా ఆపవచ్చు.

తాజా వార్తలు