డార్క్ స్పాట్స్ రిమూవ‌ల్ సీర‌మ్‌.. ఇంట్లోనే త‌యారు చేసుకోండిలా!

చ‌ర్మ స‌మ‌స్య‌లు.ఒక్క‌సారి వ‌చ్చాయంటే ఓ పట్టాన పోవు.అటువంటి వాటిలో డార్క్ స్పాట్స్ ఒక‌టి.

అందంగా మెరుస్తూ క‌నిపించే ముఖాన్ని.కాంతిహీనంగా మార్చ‌డంలో డార్క్ స్పాట్స్ త‌ర్వాతే ఏవైనా.

అందుకే డార్క్ స్పాట్స్ అంటేనే భ‌య‌పోతూ ఉంటారు.ఎండ‌ల ప్ర‌భావం, హార్మోన్ ఛేంజ‌స్‌, మొటిమ‌లు, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, మ‌ధుమేహం, వ‌య‌సు పైబ‌డ‌టం వంటి కార‌ణాల వ‌ల్ల డార్క్ స్పాట్స్ ఏర్ప‌డుతూ ఉంటాయి.

దాంతో వీటిని నివారించుకోవ‌డం కోసం వేల‌కు వేలు ఖ‌ర్చు పెట్టి ట్రీట్‌మెంట్స్ చేయించుకుంటారు.కానీ, ఇంట్లోనే ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా డార్క్ స్పాట్స్ రిమూవ‌ల్ సీర‌మ్‌ను త‌యారు చేసుకుని వాడితే.

Advertisement

న్యాచుర‌ల్‌గానే ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ.

ముందుగా ఫ్రెష్‌గా ఉండే ఒక క‌ల‌బంద ఆకును తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి.లోప‌ల ఉన్న జెల్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఈ జెల్‌ను మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా గ్రౌండ్ చేసుకుని పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల విట‌మిన్ ఇ ఆయిల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ గ్లిజ‌రిన్‌, వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాట‌ర్‌, మూడు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్ వేసుకుని క‌లుపుకోవాలి.చివ‌రిగా ఇందులో మూడు చుక్క‌లు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసి ఐదారు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటే సీర‌మ్ సిద్ధ‌మైన‌ట్లే.

ఈ సీర‌మ్‌ను ఒక బాటిల్‌లో నింపుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే దాదాపు ఇర‌వై రోజుల పాటు వాడుకోవ‌చ్చు.దీనిని ఎలా యూస్ చేయాలంటే.ముఖానికి ఉన్న మేక‌ప్‌ను పూర్తిగా తొల‌గించి వాట‌ర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.

త్రివిక్రమ్ కథ చెప్తుంటే పవన్ కల్యాణ్ నిద్ర పోతే, మహేష్ బాబు లేచి వెల్లిపోయారట
వైసీపీ కార్యాలయం కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే ? 

ఆ త‌ర్వాత త‌యారు చేసుకున్న సీర‌మ్‌ను అప్లై చేసి స్మూత్‌గా మ‌సాజ్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు రాత్రి ప‌డుకునే ముందు చేస్తే డార్క్ స్పాట్స్ క్ర‌మంగా త‌గ్గిపోతాయి.

Advertisement

తాజా వార్తలు