చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంచే క్యారెట్ ఫేస్ వాష్‌.. ఇంట్లోనే చేసుకోండిలా!

క్యారెట్‌. అద్భుత‌మైన దుంప‌ల్లో ఇది ఒక‌టి.

చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే క్యారెట్‌లో బోలెడ‌న్ని పోష‌కాలు నిండి ఉంటాయి.

అందుకే క్యారెట్ ఆరోగ్య ప‌రంగా అనేక ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తుంది.

వివిధ ర‌కాల జ‌బ్బుల‌ను దూరం చేస్తుంది.అలాగే చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంచే సుగుణాలు కూడా క్యారెట్‌కు ఉన్నాయి.

అందుకార‌ణంగానే ప‌లు సౌంద‌ర్య ఉత్ప‌త్తుల్లో క్యారెట్‌ను వినియోగిస్తుంటారు.కొంద‌రైతే త‌ర‌చూ క్యారెట్‌తో ఫేస్ ప్యాక్ వేసుకుంటారు.

Advertisement

అయితే క్యారెట్‌తో ఇంట్లోనే ఫేస్ వాష్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు.మ‌రి ఆల‌స్యం చేయ‌డం ఎందుకు క్యారెట్ ఫేస్ వాష్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక బేబీ సోప్‌ ను తీసుకుని స‌న్న‌గా తురిమి ప‌క్క‌న పెట్టుకోవాలి.అలాగే మ‌రోవైపు రెండు లేదా మూడు క్యారెట్ల‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

ఇలా క‌ట్ చేసుకున్న ముక్క‌ల‌ను మిక్సీ జార్‌లో వేసి అర క‌ప్పు రోజ్ వాట‌ర్ ను పోసి గ్రైండ్ చేసుకోవాలి.మెత్త‌గా గ్రైండ్ చేసుకున్నాక క్యారెట్ పేస్ట్ నుంచి జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో క్యారెట్ జ్యూస్‌, తురుముకున్న బేబీ సోప్‌, నాలుగు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్,

రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని హ్యాండ్ బ్లెండ‌ర్ సాయంతో నాలుగైదు నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి.చివ‌రిగా ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఫిష్ ఆయిల్‌ను యాడ్ చేస్తే క్యారెట్ ఫేస్ వాష్ సిద్ధ‌మైన‌ట్లే.ఒక బాటిల్‌లో ఈ ఫేస్ వాష్‌ను నింపి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ప‌ది నుంచి ప‌దిహేను రోజుల పాటు వాడుకోవ‌చ్చు.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

ప్ర‌తి రోజు ఉద‌యం, సాయంత్రం ఈ క్యారెట్ ఫేస్ వాష్ ను యూస్ చేస్తే చ‌ర్మంపై పేరుకుపోయిన‌ మ‌లినాలు తొల‌గిపోయి ముఖం తాజాగా, కాంతివంతంగా మెరిసిపోతుంది.మ‌రియు మొటిమ‌లు, మ‌చ్చ‌లు వంటివి ద‌రి చేర‌కుండా కూడా ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు