బాడీని వైట్‌గా, బ్రైట్‌గా మార్చే న్యాచుర‌ల్ లోష‌న్‌.. ఇలా త‌యారు చేసుకోండి!

సాధార‌ణంగా చాలా మంది ముఖ చ‌ర్మం కోసం ఎంతో ఖ‌రీదైన క్రీమ్స్‌, సీర‌మ్స్‌, మాయిశ్చ‌రైజ‌ర్స్ వాడుతుంటారు.త‌ర‌చూ ఫేస్ మాస్క్‌లు, ప్యాకులు వేసుకుంటారు.

ఫేషియ‌ల్స్ చేయించుకుంటారు.కానీ, బాడీని మాత్రం ప‌ట్టించుకోరు.

ముఖ చ‌ర్మానికి తీసుకునే శ్ర‌ద్ధ బాడీకి తీసుకోరు.దాంతో ముఖం తెల్ల‌గా ఉంటుంది.

కానీ, మిగ‌తా శ‌రీరం మాత్రం డార్క్‌గా, కాంతిహీనంగా త‌యార‌వుతుంది.మీకు ఇలా జ‌రిగిందా.? అయితే అస్స‌లు చింతించ‌కండి.ఎందుకుంటే, ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ లోష‌న్‌ను రెగ్యుల‌ర్‌గా వాడితే.

Advertisement

మీ బాడీ వైట్‌గా, బ్రైట్‌గా మార‌డం ఖాయం.మ‌రి ఇంకెందుకు లేటు ఆ బాడీ లోష‌న్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి మంద‌పాటి గిన్నెను పెట్టుకుని అందులో ఒక క‌ప్పు ఎక్స్‌ట్రా వర్జిన్ కోక‌న‌ట్ ఆయిల్ వేయాలి.ఆయిల్ కాస్త హీట్ అవ్వ‌గానే అందులో ఐదారు క‌ర్పూరం బిల్ల‌లు వేసి క‌రిగించాలి.

అలాగే నాలుగు చుక్క‌లు ట‌ర్మ‌రిక్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి రెండు నిమిషాల పాటు హీట్ చేసి స్ట‌వ్ ఆఫ్ చేయాలి.ఇలా హీట్ చేసుకున్న ఆయిల్‌ను పూర్తిగా చ‌ల్లార‌బెట్టుకోవాలి.

ఈలోపు చిన్న గిన్నె తీసుకుని అందులో ఐదు విట‌మిన్ సి ట్యాబ్లెట్స్‌ను వేసుకుని మెత్త‌టి పౌడ‌ర్‌లా దంచుకోవాలి.ఈ పౌడ‌ర్‌లో మూడు టేబుల్ స్పూన్ల రోజ్ వాట‌ర్‌ను వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని చ‌ల్లార్చుకున్న ఆయిల్‌లో వేసుకోవాలి.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

అలాగే మూడు టేబుల్ స్పూన్ల ఆలోవెర జెల్‌ను కూడా యాడ్ చేసి హ్యాండ్ బ్లెండ‌ర్ సాయంతో బాగా మిక్స్ చేసుకుంటే బాడీ లోష‌న్ సిద్ధ‌మైన‌ట్లే.దీన్ని ఒక బాటిలో నింపుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే.

Advertisement

ఇర‌వై రోజుల పాటు వాడుకోవ‌చ్చు.రోజుకు ఒకసారి ఈ బాడీ లోష‌న్‌ను రాసుకుంటే.

చ‌ర్మం వైడ్‌గా, బ్రైట్‌గా మారుతుంది.ముడ‌త‌లు ఏమైనా ఉంటే త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

మ‌రియు స్కిన్ మృదువుగా సైతం త‌యార‌వుతుంది.

తాజా వార్తలు