పది రోజుల్లోనే బెల్లీ ఫ్యాట్‌‌ను కరిగించే బెస్ట్ రెమిడీ

పొట్ట భాగంలో కొవ్వు పేరుకొని ఉంటే అసహ్యంగా కనిపించటమే కాకూండా అనారోగ్యానికి గుర్తు.

పెరిగిన బరువును తగ్గించుకోవటం తేలికే కానీ పొట్ట భాగంలో పెరిగిన కొవ్వును కరిగించుకోవటం చాలా కష్టం.

పొట్ట పెరగటం వలన మనకు నచ్చిన దుస్తులను వేసుకోలేము.అయితే ఇప్పుడు చెప్పే చిట్కా ద్వారా కేవలం పది రోజుల్లోనే పొట్టలో పేరుకున్న కొవ్వును తగ్గించుకోవచ్చు.

How To Lose Belly Fat In 10 Days-How To Lose Belly Fat In 10 Days-Telugu Health

మనకు వంటింటిలో సులభంగా అందుబాటులో ఉండే అల్లం,జీలకర్ర ఉపయోగించి బెల్లీ ఫ్యాట్‌‌ను కరిగించుకోవచ్చు.అల్లం వంటకు రుచిని కలిగించటమే కాకుండా అనేక ఔషధ గుణాలను కలిగిఉంది .పూర్వ కాలం నుండి అల్లంను జీర్ణ సంబంధ సమస్యలకు ఔషధంగా వాడుతున్నారు.జీలకర్ర మధ్యదరా సముద్ర ప్రాంత దేశాలకు చెందిన సుగంధ ద్రవ్యం అయినప్పటికీ మన భారతీయ వంటకాలలో రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం.

జీలకర్రలో పొటాషియం, ఇనుము, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది.అలాగే సీ, కె, ఈ విటమిన్లు కొద్దీ మొత్తంలో ఉంటాయి.అరలీటరు నీటిలో జీలకర్ర వేసి నీరు సగం అయ్యేవరకు మరిగించాలి.

Advertisement

దీనికి అల్లం తురుము కలపాలి.కొంచెం మరిగాక ఆ నీటిని వడకట్టి త్రాగాలి.

ఇష్టం అయినవారు దాల్చిన చెక్క, యాలకులు, తాజా నిమ్మరసం కూడా కలపొచ్చు.పది రోజుల పాటు ఉదయాన్నే పరగడుపున ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది.

రోజూ 45 నిమిషాలపాటు ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

తాజా వార్తలు