దేవుని ముందు దీపం ఎలా వెలిగించాలి?

దేవుని ముందు దీపాన్ని వెలిగించే ముందు తప్పనిసరిగా కుంకుమ లేదా విభూతి పెట్టుకోవాలి.అలాగే దీపానికి కూడా కుంకుమ పెట్టి వెలిగించాలి.

దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించకూడదు.అగరబత్తీ లేదా కర్పూరంతో వెలిగించాలి.

వ్రతాలు చేసుకొనేటప్పుడు వ్రత పీఠాన్ని కదిపిన తర్వాత మాత్రమే దీపాన్ని తీయాలి.పూజకు బొడ్డు ఒత్తులను మాత్రమే ఉపయోగించాలి.

ఈ ఒత్తులు దీపాన్ని చిరకాలం ఆత్మ జ్యోతిగా ప్రకాశించేలా చేస్తాయి.కింద భాగం బొడ్డు మాదిరిగా ఉండుట వలన నూనెను ఎక్కువగా పీల్చుకుంటాయి.

Advertisement

అయితే బొడ్డు ఒత్తిని ఎందుకు ఉపయోగించాలో అనే దానికి కూడా ఒక పరమార్ధం ఉంది.ఆత్మ జ్యోతి స్వరూపాన్ని సూచించేది బొడ్డు ఒత్తి.

కింద లావుగా ఉండి పైకి వెళ్లేకొద్దీ సన్నగా అయ్యి ఒత్తిని ప్రకాశవంతంగా వెలిగేలా చేస్తుంది.కింద ఎంత ఘనంగా ఉన్నా పైకి వెళ్లే కొద్దీ నిరాడంబరంగా ఉండి ఎక్కువ కార్యశీలత ఉండాలని సూచిస్తుంది.

Advertisement

తాజా వార్తలు