మీ వాట్సప్ నెంబర్ బ్లాక్ చేస్తే ఎలా తెలుసుకోవాలంటే..

ప్రస్తుతం సోషల్‌ మీడియా( Social media ) యుగం నడుస్తోంది.తమలోని టాలెంట్‌ను చాటుకునేందుకు కొంతమంది యువత సోషల్‌ మీడియానే వేదిక చేసుకుంటుండగా.

ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు కూడా తమ ప్రచార సాధనాలుగా సోషల్‌ మీడియాను బాగా ఉపయోగించుకుంటున్నాయి.సోషల్ మీడియా ద్వారా రాజకీయ పార్టీలు తమ సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజలను తమవైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.

ఇందులో ప్రధానంగా వాట్సాప్‌( Whatsapp ) కీలకపాత్ర పోషిస్తోందని చెప్పవచ్చు.ఎందుకంటే ఎక్కువ మంది వాట్సప్ ఉపయోగిస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్( Smartphone ) కలిగి ఉన్న ప్రతిఒక్కరూ వాట్సప్ ఉపయోగిస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం వ్యక్తిగత, ఉద్యోగ జీవితాల్లో వాట్సాప్ లేకుండా పనులు జరగడం లేదనేది మనందరికీ తెలిసిన విషయం తెలిసింది.అయితే కొంతమంది ఇష్టంలేని, నచ్చని వారి వాట్సాప్‌ను బ్లాక్‌ చేస్తున్నారు.ఇలాంటప్పుడు మన వాట్సాప్‌ నంబర్‌ ఎవరైనా బ్లాక్‌ చేస్తే ఆ విషయం మనకు తెలియదు.

కానీ కొన్ని ట్రిక్స్ ద్వారా ఎవరెవరు బ్లాక్ చేశారో సులభంగా తెలుసుకోవచ్చు.

ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేస్తే చాట్ విండోలో లాస్ట్ సీన్ కనబడదు.అలాగే ఆ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఉన్నారో, లేదో వంటివి మీకు కనిపించదు.దీంతో పాటు మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తి లేటెస్ట్ ప్రొఫైల్ ఫొటో కనబడదు.

అలాగే బ్లాక్ చేసిన వ్యక్తికి మెసేజ్ చేస్తే కేవలం ఒక్క టిక్ మార్క్ మాత్రమే వస్తుంది.అఅలాగే మీరు వాట్సాప్ కాల్ చేయలేరు.పైన చెప్పిన అన్నీ సూచనలు కనిపిస్తే ఆ వ్యక్తి బ్లాక్ చేసినట్టు అర్థం చేసుకోవాలి.

సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ అయిన స్టార్స్ ఎవరో తెలుసా..?

అయితే కొన్నిసార్లు బ్లాక్‌ చేయకపోయినా ఈ సంకేతాలు కనిపిస్తాయి.అలా ఎందుకు జరుగుతుందంటే.

Advertisement

ఎవరైనా తమ చివరిసారిగా చూసిన ఆన్‌లైన్ స్థితిని డిసేబుల్ చేసి ఉండవచ్చు.ఇలాంటి కొన్ని విషయాల ద్వారా మనం తెలుసుకోవచ్చు.

తాజా వార్తలు