నకిలీ రూ.500 నోట్లని ఇలా గుర్తించండి!

భారతదేశంలో చిల్లర నుండి పెద్ద మొత్తాల వరకు వాణిజ్య లావాదేవీలు కరెన్సీ నోట్ల ద్వారానే జరగడం సహజం.ప్రతి రోజూ కోట్లాది మంది ప్రజలు రూ.

10 నుండి రూ.500 వరకు వివిధ నోట్లను వాడుతూ ఉంటారు.అయితే నోట్ల వాడకం పెరిగిన కొద్దీ నకిలీ నోట్ల మాఫియా కూడా రోజురోజుకీ పెరిగిపోతోంది.ముఖ్యంగా ఎక్కువ వినియోగంలో ఉండే రూ.500 నోటుపై నకిలీ నోట్ల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.కేంద్ర ప్రభుత్వం 2016లో రూ.1000 నోటును రద్దు చేసిన తర్వాత కొత్త రూపంలో రూ.500 నోటును పరిచయం చేసింది.అప్పటి నుంచి దొంగలు దీన్ని అనుకరించి నకిలీ నోట్లను తయారుచేసే ప్రయత్నాలు పెంచారు.

చాలామంది ఈ నకిలీ నోట్లను గుర్తించలేక మోసపోతున్నారు.మార్కెట్లో నిజమైన కరెన్సీతో పాటు నకిలీ నోట్లను చలామణిలో పెట్టడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండటం అవసరం.మరి అసలైన రూ.500 నోటును నకిలీ నోటుతో ఎలా పోల్చాలి? మరి అలా ఎలా చూసుకోవాలో కొన్ని ముఖ్యమైన లక్షణాలు తెలుసుకుందాం.ఇందులో మొదటగా, రూ.500 నోటులో ఒక ఆకుపచ్చ రంగులోని నిలువు గీత ఉంటుంది.దీన్ని తిప్పి చూస్తే అది ముదురు నీలం (థిక్ బ్లూ) రంగులోకి మారాలి.

మారకపోతే అది నకిలీ నోటుగా గుర్తు ఉంచుకోవాలి.అలాగే నోటుపై హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చిన్న పరిమాణంలో అక్షరాలు ముద్రించబడి ఉంటాయి.

ఇవి స్పష్టంగా ఉండాలి.నిదానంగా చూడండి.

Advertisement
Fake Currency, RS 500 Note, How To Identify Fake Notes, Indian Currency Guide, S

ఇంకా అసలైన కరెన్సీ నోటు ముద్రించే కాగితం ప్రత్యేకమైనదిగా ఉంటుంది.నోటును తడిపినప్పటికీ అది మామూలు పేపర్‌లా చిరగదు.

చిరిగితే అది నకిలీ అని గుర్తించాలి.

Fake Currency, Rs 500 Note, How To Identify Fake Notes, Indian Currency Guide, S

ఇంకా నోటును వెలుతురు ఉన్న ప్రదేశంలో చూస్తే.గాంధీ ఫొటో, నోటు విలువ (500) స్పష్టంగా వాటర్ మార్క్ రూపంలో కనిపించాలి.నోటు వెనుక ముద్రించిన సంవత్సరం, స్వచ్ఛ భారత్ లోగో, స్లోగన్, రెడ్ ఫోర్ట్ చిత్రం, భాషల ప్యానెల్ మొదలైనవి ఉండాలి.

నోటుపై గాంధీ ఫొటో ఉన్న వైపు ఎడమ, కుడి చివర్లలో ఐదు చిన్న గీతలు ఉంటాయి.వేళ్లతో తడిమితే అవి ఉబ్బెత్తుగా ఉండాలి.నోటును కుడివైపునుంచి వెలుతురులో పెట్టి చూస్తే లోపల గాంధీ ఫోటో కనిపించాలి.అలాగే రూ.500 అంకె దేవనాగరి లిపిలో కనిపించాలి.అలాగే అశోక సింహ చిహ్నం స్పష్టంగా ఉండాలి.

టికెట్స్ వివాదం : సీనియర్ ఎన్టీఆర్ సమయంలోను ఇదే గొడవ.. దాసరికి ఏం జరిగిందో తెలుసా ?

ఈ వివరాలను పరిశీలించి నకిలీ నోట్లను ముందుగానే గుర్తించగలిగితే, డబ్బు మోసం నుండి తప్పించుకోవచ్చు.ప్రభుత్వం ప్రతిసారీ సాంకేతికతను ఉపయోగించి నోట్లను సురక్షితంగా రూపొందిస్తున్నా, ప్రజలైతే అవగాహనతో ఉండడం అత్యవసరం.

Advertisement

మీరు కూడా ఈ సమాచారం మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేసి, వారికి ఉపయోగపడేలా చూడండి.

తాజా వార్తలు