జుట్టు మరీ పల్చగా మారిందా.. ఒక్క అరటి పండుతో ఇలా చేస్తే నెల రోజుల్లో మూడింతలు అవుతుంది!

సాధారణంగా కొందరిలో హెయిర్ ఫాల్ అనేది అధికంగా ఉంటుంది.కానీ హెయిర్ గ్రోత్( Hair growth ) మాత్రం ఉండదు.

దీని కారణంగా జుట్టు రాలుతుంది త‌ప్పితే కొత్త జుట్టు రాదు.ఫలితంగా జుట్టు పల్చగా మారుతుంటుంది.

మీరు కూడా ప‌ల్చ‌టి జుట్టుతో బాధపడుతున్నారా.? హెయిర్ ఫాల్ కు ఎలా అడ్డుకట్ట వేయాలో తెలియడం లేదా.? హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ సూపర్ ఎఫెక్టివ్‌ గా హెల్ప్ చేస్తోంది.ఈ రెమెడీని పాటిస్తే నెల రోజుల్లో మీ జుట్టు మూడింతలు అవుతుంది.

మరి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Advertisement

అరటిపండు.( Banana )ఆరోగ్యపరంగా ఎన్ని లాభాల‌ను చేకూరుస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అయితే జుట్టు సంరక్షణకు సైతం అరటిపండు ఉపయోగపడుతుంది.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక అరటిపండును స్లైసెస్ గా కట్ చేసుకుని వేసుకోవాలి.అలాగే రెండు మందారం పువ్వులు, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ), రెండు టేబుల్ స్పూన్లు ఆముదం, మూడు టేబుల్ స్పూన్లు పెరుగు( Curd ), వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి వేసుకొని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే హెయిర్ ఫాల్( Hair fall ) ఎంత తీవ్రంగా ఉన్న సరే దెబ్బకు కంట్రోల్ అవుతుంది.

అదే సమయంలో జుట్టుకు చక్కని పోషణ అందుతుంది.హెయిర్ గ్రోత్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.కొద్ది రోజుల్లోనే పల్చగా ఉన్న మీ జుట్టు ఒత్తుగా పొడుగ్గా మారుతుంది.

కేంద్రం కీలక నిర్ణయం..బంగారం,వెండిపై సుంకాలు డబుల్
రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు : రాష్ట్ర మంత్రులు

పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల సహజంగానే హెయిర్ సిల్కీ గా షైనీ గా మెరుస్తుంది.

Advertisement

తాజా వార్తలు