అయ్యో.. 30 ఏళ్లకే ముడతలా? వర్రీ వద్దు ఇలా చేయండి!

ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం, ఒత్తిడి, శరీరానికి సరిపడా వాటర్ ను అందించకపోవడం, పలు రకాల మందుల వాడకం, మొబైల్ ఫోన్ ను అధికంగా వినియోగించడం తదితర కారణాల వల్ల ఇటీవల రోజుల్లో చాలా మంది 30 ఏళ్లకే ముడతల సమస్యను ఫేస్ చేస్తున్నారు.

ముడతలు వృద్ధాప్యానికి సంకేతం.

అందుకే ముడతలు వ‌చ్చాయి అంటే ఎక్కడ ముసలి వారిలా కనిపిస్తామో అని హైరానా పడిపోతుంటారు.ఈ క్రమంలోనే మడతల‌ను కవర్ చేసుకునేందుకు ముప్పతిప్పలు పడుతుంటారు.

కానీ ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ హోమ్ మేడ్ క్రీమ్‌ ను కనుక ప్రతిరోజు వాడితే ముడతలు ( Wrinkles )కవర్ అవ్వడం కాదు శాశ్వతంగా మాయం అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ముడ‌త‌ల‌ను నివారించే ఈ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి.

ముందుగా ఒక కప్పు పార్స్లీ ఆకులు తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.అలాగే పది ఫ్రెష్ పుదీనా ఆకులు( Spearmint ) వాటర్ లో వాష్ చేసి పెట్టుకోవాలి.

Advertisement
How To Get Rid Of Wrinkles At Early Age? Wrinkles, Latest News, Skin Care, Skin

ఆ తర్వాత మిక్సీ జార్ లో పార్స్లీ ఆకులు మరియు పుదీనా ఆకులు వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

How To Get Rid Of Wrinkles At Early Age Wrinkles, Latest News, Skin Care, Skin

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్( Corn Flour ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ పై క్రీమి స్ట్రక్చర్ వచ్చేంతవరకు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.ఈ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ మరియు నాలుగు చుక్కలు లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

How To Get Rid Of Wrinkles At Early Age Wrinkles, Latest News, Skin Care, Skin

తద్వారా మన క్రీమ్ సిద్ధం అవుతుంది.ఈ క్రీమును రోజు ఉదయం స్నానం చేయడానికి గంట ముందు మరియు నిద్రించే ముందు ముఖానికి అప్లై చేసుకుని స్మూత్ గా మసాజ్ చేసుకోవాలి.ప్రతిరోజు ఈ క్రీమ్ ను వాడితే ముడతలు కొద్ది రోజుల్లోనే మాయం అవుతాయి.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

చర్మం టైట్ గా బ్రైట్ గా తయారవుతుంది.యంగ్ గా మెరిసిపోతారు.

Advertisement

తాజా వార్తలు