జామ ఆకులతో చర్మ సమస్యలు ఇలా పోగొట్టుకొండి

జామకాయలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందని, ఇది మంచి జీర్ణశక్తి కోసం, మెటబాలిజం రేటు కోసం తినాల్సిన ఫలం అని మనకు తెలిసిందే.

అయితే కేవలం జామఫలం మాత్రమే కాదు, జామ ఆకులు కూడా ఎన్నో న్యూట్రింట్స్ కలిగి ఉంటాయి.

ఇందులో యాంటిఆక్సిడెంట్స్,యాంటి ఇంఫ్లేమెంటరి, యాంటి బ్యాక్టీరియా, యాంటి ఫంగల్ లక్షణాలు ఉంటాయి.ఫ్లవోనైడ్స్, పోలిఫెనల్స్, కారోటేనైడ్స్, తన్నిన్స్ అనే పదార్థాలు బాగా ఉండటంతో ఇవ చర్మ ఆరోగ్యానికి చాలా మంచివని చెబుతారు.

How To Get Rid Of Skin Problems With Guava Leaves-How To Get Rid Of Skin Problem

అందుకే, మొటిమలు లాంటి సమస్యలు ఉన్న, ముడతలు ఇబ్బంది పెడుతున్న, జామ ఆకులతో ఒక మిశ్రమం తయారుచేసుకొని మీ చర్మ సమస్యలకు చెక్ పెట్టండి.ఈ ప్రత్యేకమైన మిశ్రమాన్ని తయారుచేయడం చాలా సులువు.

మొదటగా ఓ కప్పులో మంచినీళ్ళు తీసుకోని చిన్నమంట మీద మరగబెట్టండి.నీళ్ళు ఓరకంగా వేడిగా ఉండగా వాటిలో ఫ్రెష్ గా ఉన్న జామ ఆకులు వేయండి.

Advertisement

నీళ్ళ రంగు బ్రౌన్ లోకి మారేదాకా, గట్టిగా అనిపించేదాకా చిన్నమంట మీదే మరగబెట్టండి.ఆ తరువాత మిశ్రమాన్ని కిందకి దించి చల్లారేదాకా ఓపికపట్టండి.

చల్లారిన తరువాత కాటన్ తీసుకొని, ఆ మిశ్రమంలో ముంచి మీకు చర్మ సమస్య ఎక్కడైతే ఉందొ, ఆ ప్రాంతంలో అద్దుతూ ఉండండి.కుదిరితే, ముఖం మొత్తం పెట్టుకున్న ఫర్వాలేదు.

దీన్ని ఓ ఇరవై నిమిషాలపాటు అలానే ఉంచి, ఆ తరువాత కడిగేసుకొండి.ఇలా వారానికి మూడు రోజులైనా చేస్తూ ఉండండి.

కొన్నిరోజుల్లోనే మీ చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఇక ఈ మిశ్రమం ఎలాంటి సమస్యలపై పనిచేస్తుంది అంటే : * మొటిమల మీద బాగా పనిచేస్తుంది.ఎందుకంటే ఇందులో యాంటి ఫంగల్ ప్రాపర్టీస్ దండిగా ఉంటాయి.

దంతాల‌ను తెల్ల‌గా మెరిపించే ఉత్త‌మ‌మైన ఇంటి చిట్కాలు మీకోసం!

ఇవి అక్నే బ్యాక్టీరియాని చంపేస్తాయి.దాంతో మొటిమలు ఎలాంటి మచ్చలు వదలకుండా మాయమైపోతాయి.

Advertisement

కొత్తగా మొటిమలు రావడం కూడా కష్టమే.* ఇంతకుముందు చెప్పినట్టుగా జామ ఆకులలో యాంటిఆక్సిడెంట్స్ ఎక్కువ.

ఇవి ఫ్రీ రాడికల్స్ ని పొగడతాయి.దాంతో ముడతల బెడద తగ్గి చర్మం నున్నగా తయారవుతుంది.

* కొందరికి చర్మం దురద ఎక్కినట్టుగా అనిపిస్తుంది.మరికొందరికి చర్మం ఎర్రగా మారుతుంది.

ఇలాంటివారికి మంటగా అనిపిస్తూ ఉంటుంది.జామ ఆకులు ఇలాంటి అలర్జీని సులువుగా పోగొడతాయి.

* ఇవి నల్లమచ్చలపై కూడా పనిచేస్తాయి.ముఖ్యంగా మొటిమలు వదిలిన మచ్చలపై ఈ జామాకుల మిశ్రమం ప్రభావం చూపుతుంది.

తాజా వార్తలు