లాలాజలంతో మొటిమలని చంపొచ్చు .. ఎలానో తెలుసుకోండి

మొటిమ చేసే మోసం అలాంటిది ఇలాంటిది కాదు.ఎప్పుడు వచ్చేది తెలియదు.

ఎంత పెద్దగా వచ్చేది తెలియదు.

ఈరోజు నున్నగా ఉన్న ముఖాన్ని రేపు మార్చేస్తుంది.

సడెన్ గా వచ్చేస్తుంది.అలాంటప్పుడు ఏం చేయాలి ? చాలామందికి తెలిసిన దారి మొటిమలని గిల్లడం.దాంతో అవి మచ్చలుగా, ఆ తరువాత గుంటలుగా మారతాయి.

మరి గిల్లకుండా మొటిమలని ఎలా పోగొట్టుకోవాలి అంటే రకరకాల క్రీమ్స్ వాడుతారు.వేలల్లో ఖర్చుపెడతారు.

Advertisement

అంత ఖర్చు అవసరమా ? కేవలం లాలాజలంతో మొటిమలని పోగొట్టుకోవచ్చు తెలుసా ? ఎలానో చూడండి.మన లాలాజలంలో peroxidase, defensins, cystatins and antibodies like IgA, thrombospondin, lysozyme, lactoferrin మరియు leukocyte .ఇలాంటి ఇంజైమ్స్ ఉంటాయి.లాలాజంలో యాంటి బ్యాక్టీరియా, యాంటి ఫంగల్, యాంటి ఇంఫ్లేమేషణ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి.

అందుకే చాలామంది అందుకే చాలామంది ఏదైనా గాయం అయినప్పుడు వెంటనే లాలాజలాన్ని రాసుకుంటారు.ఇది తెలియక చేస్తారు.బహుశా మన మెదడే అలాంటి సంకేతం పంపిస్తుందేమో.

సరే ఇప్పుడు మొటిమల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఎప్పుడైతే లాలాజలాన్ని మొటిమపై రాస్తారో, అప్పుడు అది బ్రేక్ డౌన్ అయిపోయి నిట్రిక్ ఆక్సైడ్ లా మారుతుంది.ఇది చర్మంపై పెరిగే బ్యాక్టీరియాపై పోరాడుతుంది.

ఇందులో ఉండే ఎంజైమ్స్ మరియు ప్రోటీన్స్, అన్ని సహజసిద్ధమైనవి కావడంతో, మనిషి యొక్క లాలాజలం ఇలాంటి సందర్భాల్లో సైడ్ ఎఫెక్ట్స్ ని పెద్దగా క్యారి చేయదు.కొన్ని దేశాల్లో దోమకాటుకి, కొన్నిరకాల గాయాలకి మనిషి లాలాజలాన్ని చికిత్సలో భాగంగా ఉపయోగిస్తారు.

నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!
ఉగాది ప‌చ్చ‌డితో అంతులేని ఆరోగ్య లాభాలు.. మిస్ అయ్యారో చాలా న‌ష్ట‌పోతారు!

ఇందులో పొటాషియం కూడా ఎక్కువే ఉండటంతో ఇది గాయాలపై, మచ్చలపై పనిచేస్తుంది.అయితే మొటిమపై లాలాజలాన్ని ప్రయోగించే ముందు రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాలి.

Advertisement

ఒకటి, మొటిమ మొదలైన వెంటనే రాయడం.అంటే అది ముదిరాక, లేక పగిలాక రాయకూడదు.

ఇలా మొదలవగానే అలా రాస్తే పని చేస్తుంది.రెండోవ కండీషన్ ఏమిటంటే, సాధ్యమైనంతవరకు మనం నిద్రలోంచి ఇలా లేవగానే రాయాలి.

ఎందుకంటే ఉదయం పూట వచ్చే లాలాజలం చాలా శుద్ధమైనది.తినడం, తాగడం చేసాక ఆహారంలోని ఎలిమెంట్స్ లాలాజంలో కలిసిపోతాయి.

అందుకే మంచి నీరు తాగాకముందు, నిజానికి దంతాలు కూడా శుభ్రం చేసుకోకముందే, పింపుల్ మీద లాలాజలంతో దాడి చేయండి.అదేమీ ఇమిడియేట్ ఎఫెక్ట్ చూపించదు కానీ బ్యాక్టీరియా పేరుకుపోకుండా చేసి, మొటిమ ఎదుగుదలని ఆపుతుంది.

ఆ రకంగా మొటిమ మీద బలప్రయోగం చేయకుండానే మాయం చేయొచ్చు.

తాజా వార్తలు