ఐరన్ లోపంతో ఇన్ని సమస్యలా? అయితే వెంటనే ఇలా చెక్ పెట్టండి!

మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన పోషకాల్లో ఐరన్ ఒకటి.

అయితే ఇటీవల కాలంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా కోట్లాది మందిలో ఐరన్ లోపం సర్వ సాధారణంగా తలెత్తుతుంది.

ఐరన్ లోపాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎన్నో సమస్యలు ఇబ్బంది పెడ‌తాయి.ముఖ్యంగా ఐరన్ లోపం వల్ల రక్తహీనత బారిన పడ‌తారు.

అలాగే గుండె దడ, నీరసం, అలసట, కాళ్ళ నొప్పి, వాపులు, తీవ్రమైన తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, నెలసరి సక్రమంగా రాకపోవడం తదితర సమస్యలన్నీ మ‌ద‌న పెడుతుంటాయి.వీటికి దూరంగా ఉండాలి అనుకుంటే వీలైనంత త్వరగా ఐరన్ లోపానికి చెక్ పెట్టాలి.

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ అద్భుతంగా సహాయపడుతుంది.రోజుకు ఒక గ్లాస్ ఈ జ్యూస్ ను తీసుకుంటే ఐరన్ లోపం నుండి చాలా త్వరగా బయటపడొచ్చు.

Advertisement

మ‌రి ఇంత‌కీ ఆ జ్యూస్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ముందుకు ఒక క్యారెట్, ఒక బీట్ రూట్ ను తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే ఒక దానిమ్మ పండు తీసుకుని తొక్క తొలగించి గింజలను సపరేట్ చేసుకోవాలి.అలాగే ఒక కప్పు బొప్పాయి పండు ముక్కలు కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్‌, ముక్కలు, క్యారెట్ ముక్కలు, బొప్పాయి ముక్కలు, ఐదు ఫ్రెష్ పాలకూర ఆకులు, దానిమ్మ గింజలు మరియు రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ వేసి ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకుని మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ తేనెను కలిపి నేరుగా సేవించాలి.ఈ జ్యూస్ చక్కటి రుచితో పాటు బోలెడ‌న్ని పోషకాలను కలిగి ఉంటుంది.

ముఖ్యంగా ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే ఐరన్ పుష్కలంగా అందుతుంది.తద్వారా ఐర‌న్ లోపం నుంచి చాలా వేగంగా బయటపడతారు.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
బాన పొట్టను 20 రోజుల్లో ఫ్లాట్ గా మార్చే బెస్ట్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ మీ కోసం!

ఇక ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల రక్తహీనత దూరమవుతుంది.కంటి చూపు మెరుగుపడుతుంది.

Advertisement

గుండె సంబంధిత జబ్బులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.నెలసరి సమస్యలు సైతం త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

తాజా వార్తలు