వందలో నలబై శాతం మందిని పట్టి పీడిస్తున్న ఈ ఆరోగ్య సమస్యను ముందే తెలుసుకుని ఇలా జాగ్రత్త పడండి

ఈమద్య కాలంలో తినే తిండి, మరియు ఇతరత్ర అలవాట్ల వల్ల తరుచు అనారోగ్యం బారిన పడుతూ వస్తున్నారు.

ప్రతి నెల ఏదో ఒక వ్యాది బారిన సగటున ప్రతి వ్యక్తి పడుతున్నట్లుగా ఒక సర్వేలో వెళ్లడయ్యింది.

కేవలం ఇండియా అని మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం కూడా తినే తిండి వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.మనుషులు ఎదుర్కొంటున్న అనారోగ్యంకు దాదాపు 90 శాతం కారణం ఆహారం అనేది ఒక సర్వేలో వెళ్లడయిన కఠిన నిజం.

తీవ్రమైన అనారోగ్యాలను ఎదుర్కొంటున్న జనాలు ఎక్కువగా అల్సర్‌ మరియు గ్యాస్‌ ట్రబుల్స్‌తో బాధపడుతున్నారు.గ్యాస్‌ ట్రబుల్‌ మరియు అల్సర్‌ కారణంగా మనిషి ఏం తినలేక పోతున్నారు.

ఒకసారి అల్సర్‌ ఎటాక్‌ అయితే దాన్ని జీవితాంతం అనుభవించాల్సిందే అంటూ వైధ్యులు అంటూ ఉంటారు.వైధ్యుల సూచనల మేరకు కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే ఖచ్చితంగా గ్యాస్‌ ట్రబుల్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అనేది వైధ్యులు అంటున్నారు.

Advertisement
How To Get Rid Of Gas Troubles-వందలో నలబై శాతం మ

ముఖ్యంగా ఆహార నియమాలను పాటించడం వల్ల అల్సర్‌ మరియు గ్యాస్‌ ట్రబుల్‌ అనేది చాలా వరకు కంట్రోల్‌ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.తినే సమయాలను ఖచ్చితంగా పాటిస్తే తప్పకుండా గ్యాస్‌ ట్రబుల్‌ అనేది తగ్గుతుందని అంటున్నారు.

రెండు లేదా మూడు పూటలు తినేవారు నేడు ఉదయం, మద్యాహ్నం, రాత్రి ఏ సమయాలకు అయితే తింటారో ఖచ్చితంగా అదే సమయంకు తినాలి.అంటే ఉదయం 9 గంటలకు టిఫిన్‌ చేస్తే రేపు ఉదయం 9 గంటలకు టిఫిన్‌ చేయాలి, ఇక మద్యాహ్నం రెండు గంటలకు బోజనం చేస్తే రేపు కూడా అదే తరహాలో రెండు గంటలకు బోజనం చేయాలి.

రాత్రి సమయంలో కూడా ఒకే సమయంను పాటించాలి.రాత్రి సమయంలో పడుకోవడానికి కనీసం రెండు లేదా మూడు గంటల ముందే డిన్నర్‌ను పూర్తి చేయడం వల్ల పలు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

How To Get Rid Of Gas Troubles

ఇక అల్సర్‌ మరియు గ్యాస్‌ ట్రబుల్‌ ఉన్న వారు పుపు వస్తువులు తినకుండా ఉండటం మంచిది.పచ్చి మిర్చితో పాటు మసాలా వస్తువులు తగ్గించుకోవాలి.ఎక్కువ శాతం ప్రై మరియు పులుసులు కాకుండా మద్యస్థంగా ఉండే వంటలను తినాలి.

ఓవర్ ఈటింగ్‌తో ఎన్ని స‌మ‌స్య‌లుంటాయో తెలుసా?.. దీనిని ఎలా మానుకోవాలంటే..

నాన్‌ వెజ్‌ కూడా అధికంగా తినడం వల్ల గ్యాస్‌ ట్రబుల్‌ వేదించే అవకాశం ఉంది.జీవితంలో అత్యధికంగా హింసించే ఈ గ్యాస్‌, అల్సర్‌ లను ఈ చిట్కాలతో తగ్గించుకోవచ్చు.

Advertisement

మన చేతిలో పని మరెందుకు ఆలస్యం, పాటిస్తే పోయేదేముంది.పై చిట్కాలు అల్సర్‌, గ్యాస్‌ ట్రబుల్‌ లేన వారు పాటిస్తే వారికి అవి ఎటాక్‌ కాకుండా ఉంటాయి.

అంటే పై పద్దతులు అంతా కూడా ఫాలో అవ్వొచ్చన్నమాట.

తాజా వార్తలు