కివి పండుతో ఈ పండ్లు క‌లిపి రాస్తే..న‌ల్ల మ‌చ్చ‌లు ప‌రార్‌!

న‌ల్ల మ‌చ్చ‌లు ఇవి ఒక్క సారి వ‌చ్చాయంటే ఓ ప‌ట్టాన పోవు.చ‌ర్మం ఎంత తెల్ల‌గా, మృదువుగా ఉన్నా.

న‌ల్ల మ‌చ్చ‌లు ఉంటే మాత్రం కాంతిహీనంగానే క‌నిపిస్తారు.అందుకే న‌ల్ల మ‌చ్చ‌ల‌ను నివారించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

ర‌క‌ర‌కాల క్రీములు పూస్తుంటారు.అయిన‌ప్ప‌టికీ త‌గ్గ‌కుంటే కొంద‌రు ట్రీట్ మెంట్లు కూడా చేయించుకుంటారు.

అయితే కొన్ని న్యాచుర‌ల్ టిప్స్ ద్వారా కూడా న‌ల్ల మ‌చ్చ‌లను ఎఫెక్టివ్‌గా నివారించుకోవ‌చ్చు.ముఖ్యంగా కివి పండు న‌ల్ల మ‌చ్చ‌ల‌ను మ‌టు మాయం చేయ‌డంలో అద్భుతంగా సహాయ‌ప‌డ‌తాయి.

Advertisement
How To Get Rid Of Dark Spots With Kiwi Fruit! Dark Spots, Kiwi Fruit, Benefits O

మ‌రి కివి పండును చ‌ర్మానికి ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక మిక్సీ జార్‌లో కివి పండు ముక్క‌లు మ‌రియు బాగా పండిన అర‌టి పండు ముక్క‌లు వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ పేస్ట్‌లో కొద్దిగా తేనె క‌లిపి ముఖానికి అప్లై చేయాలి.ప‌ది, ప‌దిహేను నిమిషాల త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తూ ఉంటే న‌ల్ల మ‌చ్చ‌లు క్ర‌మంగా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

How To Get Rid Of Dark Spots With Kiwi Fruit Dark Spots, Kiwi Fruit, Benefits O

అలాగే కొన్ని కివి పండు ముక్క‌లు, కొన్ని అవ‌కాడో ముక్క‌లు తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పండ్ల పేస్ట్‌లో కొద్ది ప‌చ్చి పాలు పోసి క‌లుపుకుని ముఖానికి ప‌ట్టించాలి.బాగా డ్రై అయిన త‌ర్వాత‌ చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

ఇలా రెగ్యుల‌ర్‌గా చేసినా న‌ల్ల మ‌చ్చ‌లు పోయి.ముఖం మృదువుగా మారుతుంది.

Advertisement

ఇక ఒక బౌల్‌లో కివి పండు పేస్ట్‌, స్ట్రాబెర్రీ పండ్ల ర‌సం మ‌రియు చంద‌నం పొడి వేసి క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసుకుని.

ఇర‌వై నిమిషాల అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేసినా న‌ల్ల మ‌చ్చ‌లు త‌గ్గి ముఖం తెల్ల‌గా, కాంతివంతంగా మారుతుంది.

తాజా వార్తలు