కళ్ళ చుట్టూ నల్లటి వలయాలను మాయం చేసే నిమ్మ తొక్కలు.. ఎలా వాడాలంటే?

కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడ్డాయా? అవి మీ ముఖ సౌందర్యాన్ని తీవ్రంగా పాడు చేస్తున్నాయా? వాటిని వదిలించుకోవడం కోసం ముప్పతిప్పలు పడుతున్నారా? అయితే అస్సలు చింతించకండి.

నిజానికి నల్లటి వలయాలను నివారించుకోవడం కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.

ఖరీదైన క్రీమ్, సీరం లు కొనాల్సిన అవసరం కూడా అక్కర్లేదు.కేవలం నిమ్మ తొక్కలతో( lemon peels ) సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు.

నల్లటి వలయాలను నివారించే సామర్థ్యం నిమ్మ తొక్కలకు ఉంది.మరి ఇంతకీ నిమ్మ తొక్కల‌ను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

How To Get Rid Of Dark Circles With Lemon Peel Dark Circles, Lemon Peel Benefit

ముందుగా రెండు నిమ్మ పండ్లు తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి పైన ఉండే తొక్కను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నిమ్మ తొక్కలు వేసుకోవాలి.అలాగే ఒక కప్పు రోజ్ వాటర్( Rose water ) వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement
How To Get Rid Of Dark Circles With Lemon Peel? Dark Circles, Lemon Peel Benefit

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

How To Get Rid Of Dark Circles With Lemon Peel Dark Circles, Lemon Peel Benefit

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ) వేసుకోవాలి.అలాగే మూడు టేబుల్ స్పూన్లు లెమన్ పీల్ జ్యూస్ వేసుకొని ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి.చివరిగా రెండు లేదా మూడు చుక్కలు లెమన్ ఎసెన్షియల్ ఆయిల్( Lemon essential oil ) వేసి అన్నీ కలిసేలా మరోసారి కలుపుకోవాలి.

ఇప్పుడు ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

How To Get Rid Of Dark Circles With Lemon Peel Dark Circles, Lemon Peel Benefit

రోజు నైట్ నిద్రించే ముందు ఈ క్రీమ్ ను కళ్ళ చుట్టూ అప్లై చేసుకొని కనీసం ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకుని నిద్రించాలి.రెగ్యుల‌ర్ గా ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే నల్లటి వలయాలు మాయం అవుతాయి.మరియు కళ్ళ వద్ద ఉన్న ముడతలు సైతం మాయం అవుతాయి.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

కాబ‌ట్టి నల్లటి వలయాలతో ఎవరైతే సతమతం అవుతున్నారో తప్పకుండా వారు నిమ్మ తొక్కలతో పైన చెప్పిన విధంగా క్రీమ్ ను తయారు చేసుకొని వాడేందుకు ప్రయత్నించండి.మంచి రిజల్ట్ ను మీరు గమనిస్తారు.

Advertisement

తాజా వార్తలు