Dark circles removal remedies: న‌ల్ల‌టి వ‌ల‌యాల‌తో చింతేలా? ఇంట్లోనే ఇలా వ‌దిలించుకోండి!

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని పని చేయడం, ఒత్తిడి, మొబైల్ ఫోన్ ను అధికంగా వినియోగించడం, ఆహారపు అలవాట్లు, హార్మోన్ చేంజెస్‌, పలు రకాల మందులు వాడటం తదితర కారణాల వల్ల కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి.

దాంతో ఈ నల్ల‌టి వలయాలను వదిలించుకోవడం కోసం నానా తంటాలు పడుతుంటారు.

తోచిన చిట్కాలు అన్ని ప్రయత్నిస్తుంటారు.మార్కెట్లో లభ్యమయ్యే క్రీమ్స్, సీరమ్స్ వాడుతుంటారు.

అయితే ఇకపై నల్లటి వలయాలతో చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటిస్తే ఇంట్లోనే చాలా సులభంగా నల్లటి వలయాలను వదిలించుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.

Advertisement
How To Get Rid Of Dark Circles At Home! Dark Circles, Dark Circles Removal Remed

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, ఐదు నుంచి ఎనిమిది ఫ్రెష్ తులసి ఆకులు, పావు టేబుల్ స్పూన్ కుంకుమ‌పువ్వు వేసి ప‌ది నిమిషాల పాటు బాగా మరిగించాలి.అనంతరం స్ట్రైన‌ర్ సహాయంతో వాటర్ ను ఫిల్ట‌ర్ చేసుకుని కొద్దిగా తేనెను మిక్స్ చేసి సేవించాలి.

ఈ హెర్బల్ టీను రోజుకు ఒకసారి కనుక తీసుకుంటే కళ్ళ చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలు క్రమంగా మాయం అవుతాయి.

How To Get Rid Of Dark Circles At Home Dark Circles, Dark Circles Removal Remed

అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బాదం పాలు, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, అర టేబుల్ స్పూన్ పసుపు వేసి అన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసి కనీసం ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రంగా క‌ళ్ల‌ను క్లీన్ చేసుకోవాలి.

రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే కొద్ది రోజుల్లోనే నల్లటి వలయాలు పరార్‌ అవుతాయి.ఇక నల్లటి వలయాలతో బాధపడుతున్న వారు ఒత్తిడి ఆందోళన కలిగించే వస్తువులకు, వ్యక్తులకు వీలైనంత వ‌రకు దూరంగా ఉండాలి.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

మ‌రియు టీ, కాఫీలు తాగడం బాగా తగ్గించాలి.అప్పుడే న‌ల్ల‌టి వ‌ల‌యాల నుంచి త్వ‌ర‌గా విముక్తి పొందుతారు.

Advertisement

తాజా వార్తలు