పగిలిన పాదాలను రిపేర్ చేసే తేనె.. ఎలా వాడాలో తెలుసా!

పాదాల పగుళ్లు. స్త్రీ పురుషుల్లో చాలా మంది ఫేస్ చేసే కామన్ సమస్య ఇది.

అందులోనూ ప్రస్తుత చలికాలంలో పాదాల పగుళ్ల సమస్య మరింత అధికంగా ఉంటుంది.ఇది చిన్న సమస్యే అయినప్పటికీ పగుళ్ల కారణంగా ఒక్కోసారి తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటారు.

అలాగే పగుళ్ల వల్ల నడవడానికి ఎంతో బాధాకరంగా ఉంటుంది.మీరు కూడా పాదాల పగుళ్ల‌తో బాధపడుతున్నారా.? అయితే మీకు తేనె చాలా బాగా సహాయపడుతుంది.పగిలిన పాదాలను రిపేర్ చేసే సామర్థ్యం తేనెకు ఉంది.

మరి ఇంతకీ తేనెను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.పాదాలకు తేనెను అనేక రకాలుగా ఉపయోగించవచ్చు.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

Advertisement

నైట్ ప‌డుకునే ముందు ఇలా చేసి సాక్స్ ధరించి పడుకోవాలి.ఇలా నిత్యం చేయడం వల్ల పగుళ్లు మాయం అవుతాయి.

పాదాలు మృదువుగా మారతాయి.

అలాగే ఓట్స్ తేనె కాంబినేషన్ కూడా పాదాల పగుళ్లను నివారిస్తుంది.అందుకోసం బౌల్ లో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ పౌడ‌ర్‌ మరియు నాలుగు టేబుల్ స్పూన్లు తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై సున్నితంగా రబ్ చేస్తూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒక‌సారి ఈ రెమెడీని పాటిస్తే పాదాల పగుళ్లు సమస్య దూరం అవుతుంది.

How Modern Technology Shapes The IGaming Experience
మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

ఇక ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అరటి పండు పేస్ట్, రెండు టేబుల్ స్పూన్ల తేనె, రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి.20 నిమిషాల అనంతరం పాదాలను క్లీన్ చేసుకోవాలి ఇలా చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.ఇక మీరు తేనెను డైరెక్ట్ గా కూడా పాదాలకు అప్లై చేయవచ్చు.

Advertisement

తేనెలో ఉండే సుగుణాలు పాదాల పగుళ్లను సమర్ధవంతంగా దూరం చేస్తాయి.

తాజా వార్తలు