పొటాటోతో నల్ల మచ్చలు మటాష్.. ఎలా వాడాలంటే?

పొటాటో లేదా బంగాళదుంప. పిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు అందరూ ఎంతో ఇష్టంగా తినే కూరగాయల్లో ఒకటి.

బంగాళదుంపతో( Potato ) కర్రీలు మాత్రమే కాకుండా రకరకాల స్నాక్స్ కూడా తయారు చేస్తుంటారు.ఆరోగ్యపరంగా బంగాళదుంప అనేక ప్రయోజనాలు అందిస్తుంది.

అలాగే చర్మ సౌందర్యాన్ని( Skin Beauty ) మెరుగుపరిచే సత్తా కూడా పొటాటోకు ఉంది.ముఖ్యంగా ముఖంపై ఏర్పడే నల్ల మచ్చలను( Dark Spots ) మ‌టాష్ చేయ‌డంలో పొటాటో చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

మరి అందుకు బంగాళ‌దుంప‌ను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముందుగా ఒక చిన్న బంగాళదుంప తీసుకుని వాటర్ తో శుభ్రంగా క‌డిగి పీల్‌ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కల‌ను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి( Rice Flour ) వేసుకోవాలి.

అలాగే వన్ టీ స్పూన్ పెరుగు,( Curd ) వన్ టీ స్పూన్ గ్లిజరిన్, వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ తో పాటుగా సరిపడా ఫ్రెష్ పొటాటో జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి కొంచెం మందంగా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై చర్మాన్ని శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

వారానికి రెండుసార్లు ఈ సింపుల్ రెమెడీని పాటించడం వల్ల చాలా బెనిఫిట్స్ ను పొందుతారు.ముఖ్యంగా ఈ రెమెడీ ముఖంపై నల్లటి మచ్చల‌ను క్రమంగా మాయం చేస్తుంది.పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేస్తుంది.

ఓరి దీని వేషాలో.. మొసలి యాక్టింగ్ మాములుగా లేదుగా (వీడియో)
అనుష్క మరింత స్లిమ్ గా మారుతోందా? అందుకే సినిమాలకు దూరంగా ఉందా? 

స్కిన్ కలర్ ను ఈవెన్ గా మారుస్తుంది.నల్ల మచ్చలతో ఇబ్బంది పడుతున్న వారికి ఇప్పుడు చెప్పుకున్న రెమెడీ బెస్ట్ వన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Advertisement

పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల స్కిన్ గ్లోయింగ్ గా మెరుస్తుంది.చర్మం పై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.

టాన్ ను రిమూవ్ చేయడానికి కూడా ఈ రెమెడీ ఉపయోగపడుతుంది.

తాజా వార్తలు