చీమలు నిమిషంలో పారిపోయే చిట్కా

వంటగదిలో అనేక రకాల పదార్ధాలు ఉంటాయి.వాటిని మనం ఎంత జాగ్రత్తగా పెట్టుకున్న సరే చీమలకు మాత్రం కన్పించేస్తూ ఉంటాయి.

ఆ పదార్ధాలకు చీమలు ఇట్టే పెట్టేస్తూ ఉంటాయి.చీమలు వంటగదిలోకి వచ్చాయంటే ఒక పట్టాన వదలవు.

చీమలను వదిలించుకోవడానికి ఎన్నో చిట్కాలను పాటిస్తాం.కానీ ఏమి వర్క్ అవుట్ కావు.

ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను ఉపయోగిస్తే చీమలు సులువుగా పారిపోతాయి.చీమలను తరికొట్టటానికి నిమ్మరసం బాగా సహాయపడుతుంది.

Advertisement

నిమ్మరసంలో ఉప్పు కలిపి స్ప్రై బాటిల్ లో పోసి చీమలు ఉన్న ప్రదేశంలో స్ప్రై చేస్తే ఉదయానికి చీమలు పారిపోతాయి.చీమలను వదిలించుకోవడానికి దాల్చినచెక్క పొడి మంచి రెమిడీ.

రాత్రి పడుకొనే ముందు చీమలు ఉన్న ప్రదేశంలో కొంచెం దాల్చిన చెక్క పొడిని జల్లితే ఉదయానికి చీమలు మాయం అయ్యిపోతాయి.దాల్చిన చెక్కతో ఉండే ఘాటును చీమలు భరించలేవు.

చీమలను తరిమికొట్టడానికి మరొక రెమెడీ మిరియాల పొడి.ఒక కప్పు వేడినీటిలో ఒక స్పూన్ మిరియాల పొడిని కలిపి స్ప్రై బాటిల్ సాయంతో చీమలు ఉన్న ప్రదేశంలో స్ప్రై చేస్తే చీమలు పారిపోతాయి.

ఒక గిన్నెలో నీటిని మరిగించి దానిలో ఉప్పు,కారం వేసి ఆ నీటిని చీమలు ఉన్న ప్రదేశంలో జల్లితే చీమలు క్షణాల్లో మాయం అవుతాయి.వెనిగర్ చీమలను నివారించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్30, సోమవారం 2024

బ్లాక్ వెనిగర్ ని స్ప్రై బాటిల్ లో పోసి చీమలు ఉన్న ప్రదేశంలో స్ప్రై చేస్తే వెనిగర్ వాసనకు చీమలు బయటకు వెళ్లిపోతాయి.కొన్ని వెల్లుల్లి రెబ్బలను నలిపి చీమలు ఉన్న ప్రదేశంలో పెడితే చీమలు మాయం అవుతాయి.

Advertisement

కొన్ని పుదీనా ఆకులను నలిపి చీమలు ఉన్న ప్రదేశంలో పెడితే ఆ ఘాటుకు చీమలు పారిపోతాయి.చూసారుగా ఫ్రెండ్స్ ఈ చిట్కాలను ఉపయోగించి మీ వంటగది నుండి చీమలను తరిమేసి హ్యాపీగా ఉండండి.

తాజా వార్తలు