ఏదైనా పార్టీకి వెళ్లే ముందు పెరుగుతో ఇలా చేస్తే ముఖం గ్లోగా మారుతుంద‌ట‌!

ఏదైనా పార్టీకి, ఫంక్ష‌న్‌కి వెళ్లే ముందు ముఖం గ్లోగా మారాల‌ని అంద‌రూ కోరుకుంటారు.అందుకోసం మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే ఫేస్ ప్యాకులు వాడుతుంటారు.

కానీ, ఎలాంటి ఖ‌ర్చు లేకుండా ఇంట్లో ఉండే పెరుగుతోనే న్యాచుర‌ల్‌గా ముఖాన్ని ప్ర‌కాశ‌వంతంగా మార్చుకోవ‌చ్చు.అదెలాగో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక ప‌ల్చ‌టి క్లాత్ తీసుకుని అందులో నాలుగు స్పూన్ల పెరుగును వేసుకుని నీటిని మొత్తం పిండేయాలి.వాట‌ర్ తీసేసిన పెరుగు మాత్ర‌మే యూజ్ చేయాలి.

అప్పుడు స్కిన్ అనేది గ్లోగా మ‌రియు స్మూత్‌గా మారుతుంది.ఇక ఈ పెరుగును ఎలా వాడాలో చూసేయండి.

స్టెప్‌-1:

ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ బియ్యం పిండి, అర స్పూన్ కాఫీ పౌడ‌ర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు అప్లై చేసి స్మూత్‌గా మూడు నుంచి నాలుగు నిమిసాల పాటు స్క్ర‌బ్ చేసుకోవాలి.

Advertisement
How To Get Glowing Face With Curd At Home! Glowing Face, Curd, Curd Facial, Bene

అనంత‌రం వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఈ స్క్ర‌బ్ వ‌ల్ల మురికి మృత‌క‌ణాలు పోయి స్కిన్ శుభ్రంగా మారుతుంది.

How To Get Glowing Face With Curd At Home Glowing Face, Curd, Curd Facial, Bene

స్టెప్‌-2:

ఒక బౌల్‌లో ఒక స్పూన్ పెరుగు, చిటికెడు క‌స్తూరి ప‌సుపు, ఒక స్పూన్ అలోవెర జెల్ తీసుకుని క‌లుపుకోవాలి.అపై ఈ మిశ్ర‌మానికి ముఖానికి ప‌ట్టించి ఐదు నుంచి ప‌ది నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకోవాలి.మ‌సాజ్ వ‌ల్ల బ్ల‌డ్ స‌ర్కిలేష‌న్ పెరిగి స్కిన్ డ‌ల్ నెస్ దూరం అవుతుంది.

మ‌రియు ముఖం స్మూత్‌గా మారుతుంది.

How To Get Glowing Face With Curd At Home Glowing Face, Curd, Curd Facial, Bene

స్టెప్‌-3:

ఒక బౌల్‌లో ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ ఆరెంజ్ పీల్ పైడ‌ర్‌, ఒక స్పూన్ పెస‌ర పిండి, స‌రిప‌డా రోజ్ వాట‌ర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రంతో ఫేస్‌కు ప్యాక్‌లా వేసుకుని.ఇర‌వై నిమిషాల అనంత‌రం కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

ఏదైనా పార్టీకి వెళ్లే ముందు ఈ మూడు స్టెప్స్‌ను ఫాలో అయితే గ‌నుక మీ ముఖం అందంగా, కాంతివంతంగా మారుతుంది.డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్ స‌మ‌స్య‌లు ఉంటే దూరం అవుతాయి.

Advertisement

తాజా వార్తలు