మేకప్ ఎందుకు దండగ.. చందనాన్ని ఇలా వాడితే సహజంగానే అందంగా మెరిసిపోతారు!

ఇటీవల రోజుల్లో అందంగా కనిపించడానికి మేకప్ తో( Makeup ) మెరుగులు పెట్టుకుంటున్నారు.మేకప్ లేనిదే బయట కాలు కూడా పెట్టడం లేదు.

అంతలా మేకప్ కు అలవాటు పడిపోయారు.కానీ నిత్యం మేకప్ ఉత్పత్తులను వాడటం వల్ల చర్మ ఆరోగ్యం పాడవుతుంది.

దీర్ఘకాలికంగా ఎన్నో చర్మ సమస్యలు( Skin Problems ) తలెత్తుతాయి.అందుకే సహజంగానే అందంగా కనిపించేందుకు ప్రయత్నించాలి.

అయితే అందుకు చందనం ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.చందనాన్ని( Sandalwood ) ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే సహజంగానే అందంగా ఆకర్షణీయంగా మెరిసిపోతారు.

Advertisement

ఈ రెమెడీని పాటించాక మేకప్ ఎందుకు దండగ అని మీరే అంటారు.మరి చందనం తో అందాన్ని ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక టమాటాను( Tomato ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు చందనం పొడిని వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి,( Rice Flour ) మూడు టేబుల్ స్పూన్లు టమాటా జ్యూస్, రెండు టేబుల్ స్పూన్ల పాలు, రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని కనీసం ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని కడిగి క్లీన్ చేసుకోవాలి.ఆపై మంచి మాయిశ్చరైజ‌ర్ ను( Moisturizer ) చర్మానికి అప్లై చేసుకోవాలి.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే మీ స్కిన్ టోన్ సహజంగానే పెరుగుతుంది.

Advertisement

స్కిన్ పై ఆయిల్ కంట్రోల్ అవుతుంది.మొటిమలు రావడం తగ్గుముఖం పడతాయి.మొండి మచ్చలు ఏమైనా ఉంటే మాయం అవుతాయి.

చర్మం కాంతివంతంగా ఆకర్షణీయంగా మారుతుంది.స్కిన్ స్మూత్ అండ్ షైనీ గా తయారవుతుంది.

కాబట్టి మేకప్ లేకపోయినా అందంగా ఆకర్షణీయంగా కనిపించాల‌ని భావించేవారు తప్పకుండా చందనంతో ఈ రెమెడీని పాటించండి.

తాజా వార్తలు