థైరాయిడ్ ను ఎలా గుర్తించాలి..?

థైరాయిడ్ ను ఎలా గుర్తించాలి.? ప్రస్తుతం మహిళలను బాగా వేధిస్తున్న సమస్యలో థైరాయిడ్ ఒకటి.

సాధారణంగా థైరాయిడ్ అంటే ఒక హార్మోన్.

ఇది ఎక్కువైనా తక్కువైనా సమస్యే.షుగర్, బీపీలు తర్వాత థైరాయిడ్ ఆ తర్వాత స్థానంలో ఉంది.

అందుకే 30 ఏళ్లు దాటిన ప్రతి మహిళ తప్పనిసరిగా థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి.కొంతమంది మహిళలు అయితే 30 ఏళ్ల వయసు రాకముందే థైరాయిడ్ బారిన పడుతుంటారు.

చాలా మంది మహిళల్లో పెళ్లి కాకముందే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి.చాలా మంది మహిళలకు సంతానయోగం కలగడం లేదు.

Advertisement

తక్కువ సమయంలో ఎక్కువ బరువు పెరగడం ప్రధాన సమస్య.థైరాయిడ్ ను ప్రారంభదశలోనే గుర్తించాలని వైద్యులు చెబుతున్నారు.

ఈ లక్షణాలతో థైరాయిడ్ సమస్యను సులభంగా గుర్తించవచ్చు.ముఖ్యంగా బరువు తగ్గిపోవడం, నిద్రపోయినా అలసటగా ఉండటం, నెలసరి క్రమం తప్పడం, గర్భం దాల్చలేకపోవడం, భావోద్వేగాల్లో తీవ్రమైన మార్పులు,

డిప్రెషన్ లక్షణాలు, మెడ వాపుగా ఉండటం, గొంతు బొంగురు పోవడం, చర్మం పొడిబారడం గోళ్లు పెరగడం, జుట్టు రాలడం మలబద్ధకం, ఏకాగ్రత లోపం, జ్ఞాపకశక్తి తగ్గడం ఇవి కూడా థైరాయిడ్ లో భాగమే.అందుకే ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే వెంటనే సమస్యలను పరిష్కరించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు