ఆదివారం నాడు ఉపవాసం ఎలా ఉండాలి..? పూజా విధానం, ప్రాముఖ్యత ఏంటి..?

హిందూమతంలో ఆదివారం నాడు చేసే ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది.అయితే హిందువుల విశ్వాసం ప్రకారం ఆదివారం రోజున సూర్యభగవానుని పూజించాలని ఓ నియమం ఉంది.

ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యభగవానుడు ఇతర గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు.ఎవరి జాతకంలోనైనా సూర్యునికి సంబంధించిన ఏదైనా దోషము ఉంటే సూర్య భగవానుని పూజించడం, ఆదివారం ఉపవాసం ఉండడం వలన మేలు జరుగుతుంది.

ఇక సూర్య భగవానున్ని ఆరాధించడం వలన జీవితంలో సుఖసంతోషాలు, అదృష్టాలు లభిస్తాయి.అంతేకాకుండా ఆదివారం పూజ, మతపరమైన ప్రాముఖ్యత, ఉపవాసం చేయడానికి సరైన మార్గం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

How To Fast On Sunday.. What Is The Method Of Pooja And Its Importance., Sunday

ఆదివారం భాస్కరుని అనుగ్రహం పొందడానికి సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి.ఆ తర్వాత శుభ్రమైన రాగీ పాత్రను తీసుకొని అందులో కొంత నీటిని తీసుకొని సూర్యభగవానుడి( Lord surya )కి ఆర్ఘ్యం సమర్పించాలి.ఆ తర్వాత పూజ స్థలంలో ఎర్రని చాప లేదా ఏదైనా ఎర్రటి దుప్పటిపై కూర్చొని సూర్య భగవానున్ని పూజించడం ప్రారంభించాలి.

Advertisement
How To Fast On Sunday..? What Is The Method Of Pooja And Its Importance., Sunday

ఇక సూర్య భగవానున్ని బీజ్ మంత్రంతో జపమాలతో ఐదు సార్లు జపించాలి.ఆ తర్వాత ఆదివారం నడు ఉపవాసం ఆదిత్య హృదయ స్తోత్రం పఠించాలి.సూర్యనారాయణకి ధూపం, పాలు, ఎర్రటి పువ్వులు సమర్పించడం వలన ప్రత్యేక ఫలం దొరుకుతుంది.

ఆదివారం పూజ సమయంలో సూర్య భగవానుడికి ఎర్రచందనం సమర్పించిన తర్వాత దానిని ప్రసాదంగా నుదుటిపై ధరించాలి.

How To Fast On Sunday.. What Is The Method Of Pooja And Its Importance., Sunday

అలాగే సూర్యదేవుడి నమస్కారం ముందు మీరు నిలబడి ఉన్న ప్రదేశం చుట్టూ తిరిగి ఆర్ఘ్యం నమస్కరించాలి.ఆదివారం ఉపవాస సమయంలో గోధుమ రొట్టె, బెల్లం కలిపి తినాలనే నియమం ఉంది.ఉపవాస సమయంలో ఉప్పు, అసలు తీసుకోకూడదు.

ఆదివారం వృద్యాపన చేసే సమయంలో కనీసం నలుగురు బ్రాహ్మణులకు ఆహారం అందించాలి.అలాగే ఎర్రటి బట్టలు, పండ్లు, స్వీట్లు, పువ్వులు, కొబ్బరికాయ, దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వాదం పొందాలి.

పిల్లలకు ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు ఇవ్వండి.. ఏ రోగం కూడా దరిచేరదు..?

అయితే సనాతన సంప్రదాయం ప్రకారం జీవితంలో కీర్తి, ఆనందం, శ్రేయస్సు పొందడానికి సూర్యభగవానున్ని పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.కాబట్టి సూర్యుని అనుగ్రహాన్ని పొందడానికి ఆదివారం నాడు ఉపవాసం ఉండాలి.

Advertisement

తాజా వార్తలు