ఓంకారోపాసన ఎలా చేయాలి ? ఎవరెవరు చేయవచ్చు?

తస్యవాచకః ప్రణవః అని పతంజలి చెప్పినట్లు ప్రణవం, అనగా ఓం కారం అంటే పరమాత్మ అని అర్ధం.ఉపనిషత్తులు, భగవద్గీత వంటి గ్రంథాలు ఓంకారోపాసనను ప్రబోధిస్తున్నాయి.

అందుచేత ఓంకారోపాసన అనగా పర బ్రహ్మమును ఉపాసించడమే.గీత ఎనిమిదవ అధ్యాయంలో ఓంకారోపాసనా విధానం గురించి ఇలా ఉంది.

How To Do Omkaram And Who Can Do It , Devotional , Latest Devotional , Omkara

సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్యచ | మూర్థ్యాధాయాత్మనః ప్రాణ ఆస్ధితో రాణామ్ | | ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనస్మరన్ | యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాంగతిమ్ || ఎవరు ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించి మనస్సును హృదయంలో ఇంద్రియాలన్నింటి "ఎవడు నిల్పి ప్రాణవాయువును ను శిరస్సులో ఆరోహణం కావించి యోగధారణతో పర బ్రహ్మకు వాచకమైన ఓం అనే ఏకాక్షరాన్ని ఉచ్చరిస్తూ పరమాత్మనైన నన్ను ధ్యానిస్తూ దేహాన్ని త్యజిస్తాడో వాడు సర్వోత్కృష్టమైన మోక్షం పొందుతాడు" అని భగవంతుడు చెప్పాడు.దీన్నిబట్టి ఓంకారోపాసకులు ఇంద్రియనిగ్రహం, మనోనిరోధం కల్గి యుండాలి.

యోగాన్ని శీలించి భగవంతుణ్ణి స్మరిస్తూ ఓంకారాన్ని ఉచ్చరిం చాలి.‘తజ్జపస్తదర్ధభావనమ్అన్న యోగదర్శన సూత్రం ప్రకారం ఏమంత్ర మైనా జపించే సమయంలో దాని అర్థాన్ని భావించాలి.

Advertisement

ఓంకారానికి అర్థం పరమాత్మ అంచేత పరమాత్ముణ్ణి స్మరించాలి.“అవసాన కాలంలో నిన్ను ఎలా తెలుసు కోవాలి?” అని అర్జునుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ భగవంతుడు ప్రాణ ప్రయాణ కాలంలో అని చెప్పాడు.ఆ సమయంలో ఈ స్మరణ కలగాలంటే అంతకు ముందే ఇది అలవాటులో ఉండాలి.

కావున అంతిమ సమయం రాక ముందే ప్రణవాన్ని పై జెప్పిన రీతిలో ఉపాసించడం అభ్యసించాలి.

Advertisement

తాజా వార్తలు