నోటి దుర్వాస‌నకు కార‌ణాలేంటి.. ఈ స‌మ‌స్య‌కు ఎలా చెక్ పెట్టవ‌చ్చు..?

మనలో ఎంతో మందిని కామ‌న్ గా ఇబ్బంది పెట్టే సమస్యల్లో నోటి దుర్వాసన( Bad breath ) ఒకటి.

ఉదయం శుభ్రంగా బ్రష్ చేసుకున్నప్పటికీ కొందరి నోటి నుండి చెడు వాసన వస్తుంటుంది.

ఇలాంటి వారు నలుగురిలో నోరు తెరిచి మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు.ఎక్కడ ఇతరుల హేళ‌న చేస్తారో అని భయపడుతూ ఉంటారు.

అసలు నోటి దుర్వాసనకు కారణాలేంటి.? ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టవచ్చు.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

నోటి దుర్వాసనను హాలిటోసిస్ అని కూడా పిలుస్తారు.నోటి శుభ్రత లేకపోవడం నోటి నుంచి దుర్వాసన రావ‌డానికి ప్రధాన కారణం.దంతల‌ను శుభ్రంగా తోమ‌క‌పోవ‌డం, నాలుకపై దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా పేరుకుపోవ‌డం వ‌ల్ల బ్యాడ్ బ్రీత్ స‌మ‌స్య త‌లెత్తుతుంది.

Advertisement

అలాగే ఆల్కహాల్, కెఫిన్, కారంగా ఉండే ఆహారాలు మరియు సిగరెట్లు మీ నోటిని పొడిగా చేస్తాయి.ఇది నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది.అంతేకాకుండా క‌డుపులో జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు స‌రిగ్గా లేక‌పోయిన కూడా నోటి నుంచి చెడు వాస‌న వ‌స్తుంటుంది.

నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌కు చెక్ పెట్టాలంటే ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ ( Fluoride toothpaste )తో రెండు నిమిషాల పాటు రోజుకు కనీసం రెండుసార్లు మీ దంతాలను బ్రష్ చేయండి మరియు కనీసం రోజుకు ఒకసారి ఫ్లాస్ చేయండి.దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా ను తొలగించడానికి మీ నాలుకను శుభ్రంగా క్లీన్ చేసుకోండి.

అలాగే నోటి దుర్వాసన కలిగించే ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి వంటి ఆహారాలకు దూరంగా ఉండండి.నోటిని పొడిగా చేసే ఆల్కహాల్, కెఫిన్ మరియు పొగాకును నివారించండి.ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి.

ముఖ్యంగా క‌ర‌క‌ర‌లాడే క్యారెట్స్‌, ఆపిల్స్( Carrots, apples) వంటి ఆహారాలు తినండి.ఇవి లాలాజల ప్రవాహాన్ని పెంచడానికి, నోటి దుర్వాస‌కు చెక్ పెట్ట‌డానికి ఉత్త‌మంగా తోడ్ప‌డ‌తాయి.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

నోటి దుర్వాస‌కు దూరంగా ఉండాలి అనుకుంటే పుదీనా, కొత్తిమీర‌, యాల‌కులు వంటి వాటిని న‌ములుతూ ఉండండి.లేదా వాటిని నీటిలో మ‌రిగించి తీసుకోండి.

Advertisement

ఇలా చేయ‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగుప‌డుతుంది.అదే స‌మ‌యంలో నోటి దుర్వాస‌న రాకుండా ఉంటుంది.

అలాగే డైట్ లో తాజా పండ్లు, కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు, పెరుగు, మొల‌కెత్తిన విత్త‌నాలు వంటి ఆహారాల‌ను చేర్చుకోండి.ఇవి మంచి జీర్ణ‌వ్య‌వ‌స్థ కు మ‌ద్ద‌తు ఇస్తాయి.

ఫ‌లితంగా నోలి దుర్వాస‌న స‌మ‌స్య కంట్రోల్ అవుతుంది.

తాజా వార్తలు