Vizag Studio : లైట్లకు కూడా రెంటు కట్టలేదు.. ఆ కారణంతోనే మూతపడ్డ వైజాగ్ స్టూడియో..!

తెలుగు రాష్ట్రాల్లో సినిమా స్టూడియోలకు కొదవలేదు.ముఖ్యంగా హైదరాబాద్‌లో చాలా సినిమా స్టూడియోలు ఉన్నాయి.

అయితే మన తెలుగు రాష్ట్రాల్లో తొలి స్టూడియో రాజమండ్రిలో ప్రారంభమైంది.1936 ఏటా లాంచ్ అయిన దీనికి దుర్గా సినీటోన్‌ ( Durga Cinetone )పేరు పెట్టారు.ఆ తర్వాత ఈ స్టూడియో ఓనర్లు ‘సంపూర్ణ రామాయణం’ మూవీ నిర్మించాలని నిర్ణయించారు.

అనుకున్నదే తడవుగా స్టూడియోలోనే సెట్‌ నిర్మించి షూటింగ్ కూడా ప్రారంభించేశారు.ఎన్నో ఆశలతో ప్రారంభించిన ఈ సినిమా అనుకోని కారణాలవల్ల ఆగిపోయి అందరికీ తీవ్ర నిరాశను మిగిల్చింది.

ఓనర్లు ఈ స్టూడియోను కూడా క్లోజ్ చేశారు.అప్పటికే సినిమా షూటింగ్‌కి కావాల్సిన చాలా పరికరాలను కొనేశారు.

అవి వేస్ట్ అయిపోకుండా వాటిని బొబ్బిలి రాజావారు, చిక్కవరం జమీందారులకు అమ్మేశారు.వారిద్దరూ వాటిని కొనుగోలు చేశాక "ఆంధ్రా సినీటోన్‌" పేరిట వైజాగ్‌లో ఓ స్టూడియోను లాంచ్ చేశారు.

How This Studio Collapsed
Advertisement
How This Studio Collapsed-Vizag Studio : లైట్లకు కూడా ర

ఇదే స్టూడియోలో సి.పుల్లయ్య డైరెక్షన్‌లో ‘మోహిని భస్మాసుర( Mohini Bhasmasura )’, హిరేన్‌బోస్‌ దర్శకత్వంలో ‘భక్త జయదేవ’ ప్రొడ్యూస్‌ చేశారు.ఈ రెండిటి తర్వాత ముచ్చటగా మూడో మూవీని కూడా నిర్మించారు.

కొచ్చెర్లకోట రంగారావు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా పేరు ‘పాశుపతాస్త్ర’.ఈ మూడు సినిమాల నిర్మాణం కోసం స్టూడియో ఓనర్లు ఓ కంపెనీ నుంచి లైట్లను అద్దెకు తెచ్చుకున్నారు.వాటితోనే మూడు సినిమాలను త్వరగా పూర్తి చేయగలిగారు.

How This Studio Collapsed

మరో పౌరాణిక సినిమాను కూడా మొదలుపెట్టారు.అయితే షూటింగ్ కోసమని తీసుకొచ్చిన ఆ లైట్లకు అద్దె చెల్లించలేదు ఓనర్లు.దీనివల్ల కంపెనీ ఆ లైట్లను షూటింగ్ జరుగుతుండగానే తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది.

నిజానికి ఆ లైట్ల రెంటు కట్టగలిగే స్తోమత ఓనర్లకు ఉంది.కావాలనుకుంటే డబ్బు చెల్లించి వాటిని మళ్లీ వెనక్కి తెచ్చుకోగలిగే వారు కానీ ఆ పని చేయలేదు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

లైట్ లేకపోతే షూటింగ్ చేయడం కుదరదు కాబట్టి స్టూడియో మూత పడింది.అప్పట్లో ఈ సంగతి తెలిసి చాలామంది షాక్ అయ్యారు.

Advertisement

బహుశా సినిమాలు తీయడం వల్ల ఓనర్లకు ఎలాంటి లాభాలు రాకపోయి ఉండవచ్చు.అందుకే ఆసక్తి లేక ఈ స్టూడియో క్లోజ్ చేయడానికి వారు ఎక్కువ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

ఈ స్టూడియో ఓనర్లు ఆస్తిపరులే కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోలేదని కూడా అర్థం అవుతోంది.

తాజా వార్తలు