శ్రీయా భూపాల్‌ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ?

సినీ ఇండస్ట్రీలో సెలెబ్రెటీల పెళ్లి అంటే అందరికి ఎంత ఆసక్తి ఉంటుందో తెలిసందే.

ఇక సెలెబ్రటీలు డైవర్స్ తీసుకుంటే ఆ న్యూస్ ఎంత వైరల్ అవుతుందంటే ఎక్కడ చూసిన ఆ టాపిక్ గురించే చర్చ ఉంటుంది.

తాజాగా అక్కినేని ఇంట్లో ఇలాంటి సంఘటనలే చోటుచేసుకున్నాయి.నాగచైతన్య- సమంత ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తరువాత కొన్ని నెలలే డైవర్స్ తీసుకున్నారు.

వీరి డైవర్స్ విషయం అప్పట్లో ఒక వైరల్ టాపిక్.ఆ తరువాత అక్కినేని అఖిల్ ఎంగేజ్ మెంట్ తరువాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు.

లేదంటే ఇప్పటికి అఖిల్( Akhil ) పెళ్లి అయిపోయి ఉండేది.అక్కినేని అఖిల్ గురించి పరిచేయం చేయాల్సిన అవసరం లేదు.

Advertisement

వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.అఖిల్ ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే రెడ్డి( GVK Reddy ) మనవరాలు శ్రీయ భూపాల్ ( Shriya Bhupal )తో అఖిల్ ప్రేమలో పడ్డాడు.అంతేకాదు వీరి ఎంగేజ్ మెంట్ కూడా 2017 లో గ్రాండ్ గా జరిగింది.2018 లో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాల్సి ఉండింది.పెళ్లి పనులు కూడా వేగంగా మొదలుపెట్టారు.

కానీ ఆ తరువాత ఏం జరిగిందో తెలియలేదు పెళ్ళికి ముందే ఈ జంట విడిపోయి షాకిచ్చారు.పెళ్ళికి ముందే విడిపోయారు.

దీంతో పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యింది.ఆ తర్వాత అఖిల్ టాలీవుడ్ ( Tollywood )లో వరుస‌ సినిమాలు చేసుకుంటూ బిజీ అయిపోయాడు.

అఖిల్ తో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న శ్రీయా భూపాల్ కూడా బిజీ అయిపోయింది.అయితే శ్రీయా భూపాల్ ఏం చేస్తుంది, ఎలా ఉంది అన్న విషయం చాలా మందికి తెలియదు.అయితే పెళ్లి క్యాన్సిల్ అయ్యాక శ్రీయా భూపాల్ న్యూయార్క్ లో ఫ్యాషన్ స్కూల్లో చదువుకుంది.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

త్వరలోనే కాస్ట్యూమ్ డిజైనర్ గా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనుంది.

Advertisement

శ్రీయా భూపాల్.2018లో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి మనవడు చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి( MP Visveshwar Reddy ) పెద్ద కుమారుడు ఉపాసన కామినేని తమ్ముడు అనిందిత్ రెడ్డిని( Anindit Reddy ) పెళ్లి చేసుకుంది.వీరి వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది.

అంతే కాదు ఈ దంపతులకు పండంటి మగ బిడ్డ కూడా జన్మించాడు.మొత్తానికి అఖిల్ తో పెళ్లి క్యాన్సిల్ అయ్యాక శ్రీయా భూపాల్ త్వరగానే సెటిల్ అయిపోయింది.

శ్రీయ ఒకవైపు ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు తన వృత్తిని కూడా కొనసాగిస్తుంది.అయితే అఖిల్ కి వేరే అఫైర్స్ ఉండడం వల్లే అఖిల్ తో పెళ్లి క్యాన్సిల్ అయినట్టు వార్తలు వచ్చాయి.

అఖిల్ ఆస్తుల‌ విషయంలో జరిగిన గొడవ కూడా పెళ్లి క్యాన్సిల్ అవడానికి కారణమని రూమర్లు వచ్చాయి.ఇందులో ఏది నిజమో వారికే తెలియాలి.

తాజా వార్తలు