MR Radha: హీరోయిన్ రాధిక తండ్రి చేసిన ఈ గొప్ప త్యాగం గురించి మీకు తెలుసా.?

సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఏది కూడా ఫ్రీగా చేయడానికి ఇష్టపడరు.

అది నాటి నాటక రంగం నుంచి నేటి వెండి తెర వరకు అదే పరిస్థితి కొనసాగుతుంది.

ఎవరైనా ఒక సినిమా లేదా నాటకం హక్కులు అడిగితే తమకేంటి లాభం, తమకు ఎంత ఇస్తారు , ఎంత ఇస్తే పర్మిషన్ ఇస్తారు అంటూ బేరాలు ఆడుతూ ఉంటారు.కానీ వీటన్నిటికీ విరుద్ధం సీనియర్ హీరోయిన్ రాధిక( Radhika ) తండ్రి ఎంఆర్ రాధా.

( MR Radha ) జీవితమంతా వివాదాలు, చిక్కుముడులతో నటుడు రాధా జీవితం ఉంటుంది.కానీ ఆయనలో ఉన్న మంచి విషయాలను మాత్రం ఎవరూ చెప్పుకోవడానికి ఇష్టపడరు.

ఏం ఆర్.రాధా మొదట సినిమా ఇండస్ట్రీకి రాకముందు నాటకాల్లోనే నటించేవారు.ఆయన సరదాగా చూసిన ఒక నాటకాన్ని పక్కా ప్రొఫెషనల్ గా రాయించి కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చారు.

Advertisement

ఆ నాటకం మరేదో కాదు రక్త కన్నీరు.రక్త కన్నీరు పేరుతో తెలుగులో ఇదే నాటకాన్ని నాగభూషణం ( Nagabushanam ) పోషించిన విషయం మనకు తెలిసిందే.అయితే దీనికి మూలం మాత్రం నాగభూషణం వ్రాయించిన కథ కాదు, ఇదే కథను మొదట తమిళనాడులో ఎమ్ ఆర్.రాధా రాయించి కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చారు.తమిళనాడు లో అతి పెద్ద విజయవంతమైన నాటకంగా దీనికి పేరు ఉంది.

ఇది ఓసారి కన్నడ రాష్ట్రంలో ఎవరో వేస్తే రాధ చూడగా దాన్ని తమిళంలో రాయించారు.ఇది చూసిన నాగభూషణం గారు దాన్ని తెలుగులో అనువదించాలని అనుకున్నారు.అనుకున్నదే తడువుగా నాగభూషణం ఏం ఆర్.రాధా దగ్గరికి వెళ్లి దాని రీమేక్ హక్కులను అడిగారు.ఆయన దానికి సంతోషంగా ఓకే అన్నాడు.

ఆ నాటకాన్ని తెలుగువారికి ఇవ్వడం కోసం ఎంత డబ్బు కావాలని నాగభూషణం అడగగా అందుకు రాదా ఒక నవ్వు నవ్వాడు.ఇది నా సొంత కథ కాదు, నేను ఎక్కడో చూసిందే.దీనికి ఎవరు హక్కుదారులు లేరు.

ఇది అందరూ సంతోషంగా ఎక్కడైనా ప్రదర్శించుకోవచ్చు.దానికి నాకు ఎలాంటి డబ్బు కట్టనక్కర్లేదు కానీ దీనికి ప్రాచుర్యం కల్పించింది మాత్రం నేనే.

లైంగిక శ‌క్తిని దెబ్బ‌తీసే ఈ ఆహారాల‌తో జ‌ర జాగ్ర‌త్త‌!

మీరు కూడా ఇది జాగ్రత్తగా చేసుకోండి అంటూ రాధ చెప్పారట.దాంతో నాగభూషణం రక్త కన్నీరు తెలుగు లో రాయించి ఈ నాటకాన్ని భారతదేశంలో ఎన్నో వేలసార్లు అనేక రాష్ట్రాల్లో ప్రదర్శించి తన ఇంటి పేరు రక్త కన్నీరుగా మార్చుకున్నాడు.

Advertisement

తెలుగు ప్రేక్షకులకు రక్త కన్నీరు నాగభూషణం గానే సుపరిచితం.

తాజా వార్తలు