సబ్బు ఎంత పనిచేసింది.. ఏకంగా మూడంతస్థుల మేడ మీద నుండి..

కర్నాటకలోని బెంగళూరు( Bangalore in Karnataka ) నగరంలో జరిగిన ఓ ఘోర ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఆ ఫోటోలలో ఓ మహిళ మూడంతస్తుల భవనంపై నుంచి పడిపోయింది.

ఆమె టెర్రస్ మీద ఏదో పని చేస్తోంది.ఆమెతో పాటు ఆమె భర్త కూడా ఉన్నాడు.అప్పుడు మహిళ కాలు కింద సబ్బు పడింది.

దీంతో పొరపాటున కాలు జారి ఆ మహిళ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది.ఆ మహిళ పైకప్పు మీద నుండి పడటం ప్రారంభించింది.

అప్పుడు అది గమనించిన మహిళ భర్త ఆమె చేయి పట్టుకున్నాడు.ఆ మహిళను పైకి లాగేందుకు ప్రయత్నించడం చేసాడు.

Advertisement
How Much Soap Worked From The Top Of The Three Floors Together, WOMAN, SOAP , VI

అయితే ఆ మహిళ ఆ భవనంపై నుంచి పట్టు వదిలి జారి కింద పడిపోయింది.

How Much Soap Worked From The Top Of The Three Floors Together, Woman, Soap , Vi

వెంటనే మహిళను ఆస్పత్రికి తరలించారు భర్తతో కలిసి అక్కడి స్థానికులు.ఇకపోతే ఆసుపత్రిలో ఆమె పరిస్థితి కాస్త విషమంగా ఉందని సమాచారం.డీజే హళ్లి పోలీస్‌స్టేషన్‌( DJ Halli Police Station ) పరిధిలోని కనక్‌నగర్‌ వ్యవహారం అనే 27 ఏళ్ల మహిళ రుబాయి ( Rubai )తన భర్తతో కలిసి టెర్రస్‌పై బట్టలు ఉతుకుతోంది.

బట్టలు ఆరబెట్టడానికి లేవగానే పొరపాటున కింద పడి ఉన్న సబ్బు ఆమె కాలు కిందకి వెళ్ళింది.దీంతో మహిళ బ్యాలెన్స్ తప్పి పైకప్పు పై నుంచి కిందపడటం జరిగింది.

ఆ మహిళ భర్త కూడా ఆమెతో పాటు ఉన్నా కానీ అతడు ఆమెను కాపాడుకోలేక పోయాడు.

How Much Soap Worked From The Top Of The Three Floors Together, Woman, Soap , Vi
స్కిన్ టోన్ రోజురోజుకు తగ్గిపోతుందా.. వర్రీ వద్దు ఖచ్చితంగా ఇది తెలుసుకోండి!

ప్రస్తుతం ఆ మహిళ విక్టోరియా ఆస్పత్రిలో( Victoria Hospital ) చికిత్స పొందుతుండగా.భవనం పై నుంచి పడిన తాకిడికి మహిళ అపస్మారక స్థితికి చేరుకుంది.ఇక మహిళ భవనంపై నుంచి పడిపోతున్న దృశ్యాన్ని స్థానికుల మొబైల్‌ ఫోన్‌ లో చిత్రీకరించారు.2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ ఘటన బెంగుళూరులోని డీజే హళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకోగా, పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు