TDP, BJP: ఎన్డీయే లోకి టీడీపీ.. బీజేపీ కి ఎన్ని సీట్లు ఇస్తున్నారంటే ?

గత రెండు రోజులుగా టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) ఢిల్లీలోనే మకాం వేసి మరీ బిజెపి కీలక నేత,  కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోను , బిజెపి జాతియ అధ్యక్షుడు జేపీ నడ్డా తోను పొత్తుల అంశంపై చర్చలు జరిపారు.

ఈ పొత్తుల చర్చలు ఫలించడంతో టిడిపి, జనసేన,  బిజెపి ( TDP, Jana Sena, BJP )మధ్య పొత్తు ఇక కుదిరినట్లే .

లాంఛనంగా ఎన్డీఏలోకి టిడిపి చేరబోతోంది.  ఈరోజు ఉదయం 11 గంటలకు అమిత్ షా తో చంద్రబాబు పవన్ భేటీ అయ్యారు .దాదాపు గంట పాటు ఈ పొత్తుల అంశంపై చర్చలు జరిపారు.బిజెపికి టిడిపి అధినేత చంద్రబాబు ఇవ్వాలనుకుంటున్న సీట్లు తదితర అంశాలపై చంద్రబాబు పవన్ లతో అమిత్ షా చర్చించారు.

  అలాగే బిజెపి కోరుకుంటున్న సీట్ల వివరాలను ఆ పార్టీ అధినాయకత్వం చంద్రబాబు పవన్ ల ముందు ఉంచిందట.ఈ సందర్భంగా సీట్ల సర్దుబాటుపై చర్చించి ఒక క్లారిటీకి వచ్చినట్లు సమాచారం .

పొత్తులో భాగంగా 6 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు టిడిపి అధినేత చంద్రబాబు అంగీకారం తెలిపారట.అసెంబ్లీ సీట్ల విషయంలో అమిత్ షా ( Amit Shah )తో జరిగిన చర్చల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదట.దీనిపై రాష్ట్ర స్థాయి నాయకులతో చర్చించాలని బిజెపి నిర్ణయించుకుందట.

Advertisement

రాష్ట్ర బిజెపి ఏపీ అధ్యక్షురాలతో మాట్లాడాలని అమిత్ షా సూచించినట్లు సమాచారం.  మరికొద్ది సేపట్లో టిడిపి, జనసేన , బిజెపి ఉమ్మడి ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నాయి, .టిడిపి,  బిజెపి మధ్య పొత్తు ఖాయం కావడంతో ఈనెల 14న జరగబోయే సమావేశానికి టిడిపిని సైతం ఆహ్వానించారట.అయితే టిడిపి జనసేన బిజెపి మధ్య పొత్తు ఖాయమైన నేపథ్యంలో సీట్ల పంపకాలు ఏ విధంగా చేపడుతారు అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది .

బిజెపికి 6 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు టిడిపి అంగీకారం తెలిపింది.అయితే ఆ ఆరు నియోజకవర్గాలు ఏమిటి అనేది ఎక్కడా బయటకు రాకుండా చంద్రబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు .ఇప్పటికే జనసేనకు పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ , మూడు ఎంపీ సీట్లు ఇచ్చారు .మిగిలిన స్థానాల్లో టిడిపి , బిజెపి సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు