గణపతులు ఎంత మంది? వారి భార్యలు ఎవరు?

మనం ఏ పూజ చేసినా.ఏ వ్రతం చేసినా ముందుగా గణపతిని పూజిస్తాం.

వినాయకుడి పూజ తర్వాతే మిగిలిన దేవతలకు పూజలు నిర్వహిస్తుంటాం.అయితే మనకు తెలిసినంత వరకు విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి సిద్ధి, బుద్ధి అనే భార్యలు ఉన్నారనే విషయం మన అందరికీ తెలిసిందే.

How Many Ganapathis Are There And Who Are Their Wives , Ganapathi , Wives , Devo

కానీ గణపతిలో పలు రకాలు ఉన్నాయని.అందులో వారి భార్యలకు పలు పేర్లు ఉన్నాయనైతే తెలియదు.

అయితే గణపతులు ఎంత మంది.వారి భార్యలు ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

సిద్ధి గణపతి భార్య పేరు సిద్ధిబుద్ధి.లక్ష్మీగణపతి భార్య పేరు జయలక్ష్మి.అలాగే ధూమ్ర గణపతి భార్య పేరు సిద్దలక్ష్మి.

కృష్ణ గణపతి భార్య పేరు సువర్ణా దేవి.రక్త వర్ణ గణపతి భార్య పేరు పద్మావతి.

అలాగే సువర్ణ గణపతి భార్య పేరు రజత దేవి.విష్ణ గణపతి భార్య పేరు ప్రజాదేవి.

నిర్విఘ్న గణపతి భార్య పేరు అతి ప్రజ్ఞాదేవి.వికట గణపతి భార్య పేరు జ్ఞానాదేవి.

వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయాల‌నుకుంటున్నారా? అయితే ఈ ఫుడ్స్ మీకే!

బాల చంద్ర గణపతి భార్య పేరు చంద్రముఖి.అంబర గణపతి భార్య పేరు సంహార దేవి.

Advertisement

భద్ర గణపతి భార్య పేరు శాంతిదేవి.శుక్ల గణపతి భార్య పేరు బుద్ధి లక్ష్మి.

ఋణ విమోచన గణపతి భార్య పేరు సౌభాగ్య లక్ష్మి.లంబోదర గణపతి భార్య పేరు లోకమాత.

లక్ష్మీప్రద గణపతి భార్య పేరు వరలక్ష్మీ.వక్రతుండ గణపతి భార్య పేరు నవరత్న లక్ష్మి.చింతామణి గణపతి భార్య పేరు విజయ లక్ష్మి.

అలాగే ఏకదంత గణపతి భార్య పేరు సిద్ధిలక్ష్మి.

తాజా వార్తలు