రోజుకో కివి పండు తింటే శరీరంలో ఎన్ని మార్పులు వ‌స్తాయో తెలుసా?

కివి పండు.( Kiwi Fruit ) దీని అస‌లు పేరు చైనీస్ గూస్‌బెర్రీ.

ఇది చైనాలో వందల ఏళ్ల నుంచే పండుతోంది.20వ శతాబ్ద ప్రారంభంలో న్యూజిలాండ్‌కి తీసుకెళ్లారు.అక్కడ దానికి కివి అనే పేరు పెట్టారు.

కివి అనేది న్యూజిలాండ్ జాతీయ పక్షి పేరు.చైనా పండు అయిన‌ప్ప‌టికీ.

న్యూజిలాండ్‌ పేరుతో కివి పండు ప్రసిద్ధి చెందింది.ధ‌ర కొంచెం ఎక్కువై అయిన‌ప్ప‌టికీ.

కివి పండులో అందుకు త‌గ్గా పోష‌కాలు స‌మృద్ధిగా నిండి ఉంటాయి.అందువ‌ల్ల ఆరోగ్య ప‌రంగా ఇది చాలా ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తుంది.

Advertisement
How Many Changes Occur In Your Body If You Eat Kiwi Fruit Every Day Details, Ki

ముఖ్యంగా రోజుకో కివి పండు తింటే శ‌రీరంలో అనేక మార్పులు వ‌స్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు.విట‌మిన్ సి( Vitamin C ) పుష్క‌లంగా ఉండే పండ్ల జాబితాలో కివి ఒక‌టి.

రోజుకో కివి పండు తిన‌డం వ‌ల్ల అందులోని విట‌మిస్ సి జలుబు, ఫ్లూ వంటి ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.వైరస్‌, బ్యాక్టీరియాలపై పోరాడటానికి శ‌రీరాన్ని శ‌క్తివంతంగా మారుస్తుంది.

విటమిన్ సి బాడీలో ఐరన్ శోషణను మెరుగుప‌రుస్తుంది.త‌ద్వారా రక్తహీనత స‌మ‌స్య ఉండే దూరం అవుతుంది.

How Many Changes Occur In Your Body If You Eat Kiwi Fruit Every Day Details, Ki

అలాగే నిద్ర‌లేమితో( Insomnia ) బాధ‌ప‌డుతున్న వారికి కివి పండు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ట‌.రోజుకో కివి తినడం వలన నిద్ర సమయానికి మెలటోనిన్ ఉత్పత్తి పెరిగి బాగా నిద్రపడుతుంద‌ని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.తక్కువ కేల‌రీలు, అధిక ఫైబర్ క‌లిగి ఉండ‌టం వ‌ల్ల కివి పండు కడుపు నిండిన ఫీలింగ్ ను అందిస్తుంది.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

అతిగా తినకుండా నిరోధిస్తుంది.బ‌రువు నియంత్రణలో సహాయంగా ఉంటుంది.

How Many Changes Occur In Your Body If You Eat Kiwi Fruit Every Day Details, Ki
Advertisement

నిత్యం ఒక కివి పండును తిన‌డం వ‌ల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాల్ని కాపాడుతాయి.మొటిమలు, ముడతలు తగ్గించడంలో తోడ్ప‌డ‌తాయి.య‌వ్వ‌న‌మైన మెరిసే చ‌ర్మాన్ని ప్రోత్స‌హిస్తాయి.

అంతేకాదండోయ్‌.కివి పండు రక్తంలో సోడియం స్థాయిని సమతుల్యం చేస్తుంది.

ర‌క్త‌పోటును నియంత్ర‌ణ‌లో ఉంచుతుంది.కివిలో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించి హృదయ ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తాయి.

జీర్ణక్రియకు కివి పండు చాలా మేలు చేస్తుంది.

తాజా వార్తలు