సేమియా ఎలా త‌యార‌వుతుంది.. ఆరోగ్యానికి ఇది మంచిదేనా?

సేమియా( Vermicelli ) గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.`వెర్మిసెల్లీ` అనే తేలికపాటి, నాజూకైన నూడుల్స్ తరహా పదార్థానికి తెలుగు పేరే సేమియా.

సేమియాతో ఉప్మ‌, పాయసం వంటి వంట‌కాల‌ను ఎక్కువ‌గా చేస్తుంటారు.కొంద‌రు సేమియాతో ర‌క‌ర‌కాల స్పాక్స్‌, బిర్యానీ లేదా పులావ్ వంటి ఫుడ్స్ ను కూడా ప్రిపేర్ చేస్తుంటారు.

సేమియాతో చేసే వంట‌కాల‌కు వంక పెట్ట‌లేం.అయితే అస‌లు సేమియా ఎలా త‌యార‌వుతుంది.? ఆరోగ్యానికి ఇది మంచిదేనా? అని ఎప్పుడైనా ఆలోచించారా?భారతీయ వంటకాలలో సేమియా విస్తృతంగా ఉపయోగించబడుతుంది.సేమియా ఆరోగ్యానికి మంచిదా? కాదా? అని ప‌శ్నిస్తే.అది క‌చ్చితంగా మీరు ఏ రకం సేమియాను ఉపయోగిస్తున్నారు అన్న‌దానిపై ఆధార‌ప‌డి ఉంటుంది.

సేమియా తయారు చేసే ముడి సరుకు వేరువేరు రకాలుగా ఉంటుంది.వాటి ఆధారంగా సేమియా ఆరోగ్య ప్రభావం మారుతుంది.

Advertisement

కొన్ని చోట్ల సేమియాను సంపూర్ణ గోధుమ పిండితో త‌యారు చేస్తారు.గోధుమ పిండితో( Wheat ) చేసే సేమియాలో ఫైబర్, పోషకాలు ఎక్కువ‌గా ఉంటాయి కాబ‌ట్టి.ఆరోగ్యానికి చాలా మంచిది.

అలాగే కొన్ని చోట్ల సేమియాను మైదాతో త‌యారు చేస్తారు.ఈ సేమియా ఆరోగ్యానికి అస్స‌లు స‌రిప‌డ‌దు.

ముఖ్యంగా మ‌ధుమేహం ( Diabetes ) ఉన్న‌వారు తిన‌కూడ‌దు.

ఈ మ‌ధ్యకాలంలో మిల్లెట్ సేమియా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది.రాగులు, జొన్నలు, సజ్జలు వంటి మిల్లెట్స్( Millets ) తో సేమియాను చేస్తాయి.మిల్లెట్ సేమియా గ్లూటెన్-ఫ్రీగా ఉండ‌ట‌మే కాకుండా.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

ఫైబర్ మరియు మినిరల్స్ ను అధికంగా క‌లిగి ఉంటుంది.బీపీ, డయాబెటిస్, ఓవ‌ర్ వెయిట్ ఉన్నవారికి మిల్లెట్ సేమియా ఉత్త‌మ ఆహారం అవుతుంది.

Advertisement

ఇక కొంద‌రు బాస్మతి రైస్ లేదా సాధారణ బియ్యం పిండితో కూడా సేమియాను త‌యారు చేస్తుంటారు.ఇది తేలికగా జీర్ణమవుతుంది కానీ ఫైబర్ తక్కువగా ఉంటుంది.

మితంగా రైస్ సేమియాను తీసుకోవ‌చ్చు.ఫైన‌ల్ గా చెప్పేది ఏంటంటే.

ఆరోగ్యప‌రంగా మిల్లెట్ సేమియా, గోధుమ సేమియా ఉత్త‌మ‌మైన‌వి.ఇవి పొట్టకు తేలికగా ఉంటాయి.

తినగానే ఎనర్జీని అందిస్తాయి.డయాబెటిస్ కంట్రోల్‌కు సహాయపడ‌తాయి.

మరియు హార్ట్ హెల్త్‌కు కూడా మంచివి.

తాజా వార్తలు