Google Maps : గూగుల్ మ్యాప్స్ లో ఏఐ జనరేటివ్ ఫీచర్లు.. ఎలా పని చేస్తాయంటే..?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( Artificial Intelligence ) టెక్నాలజీ అన్ని రంగాల్లో వేగంగా విస్తరిస్తోంది.

పెద్ద పెద్ద టెక్ కంపెనీలు అన్నీ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ టెక్నాలజీ పై ప్రత్యేక దృష్టి పెట్టాయి.

గూగుల్ కూడా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పై ఫోకస్ పెట్టింది.గూగుల్ జనరేటివ్ ఏఐ టూల్స్( AI tools ) లాంచ్ చేసి, పటిష్టమైన పునాదిని స్థాపించడానికి ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్ లో జనరేటివ్ ఏఐ ఫీచర్లు విస్తరించాయి.జనరేటివ్ ఏఐ సహాయంతో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫీచర్లను గూగుల్ మ్యాప్స్ ( Google Maps ) అందించనుంది.

గూగుల్ మ్యాప్స్ దాదాపు 20 మిలియన్ ప్లేసెస్ ఇన్ఫర్మేషన్, 300 మిలియన్ల కాంట్రిబ్యూటర్స్ జాబితాను అనలైజ్ చేసి రెస్టారెంట్ రికమెండేషన్స్ వంటివి చేయనుంది.

How Do Ai Generative Features Work In Google Maps
Advertisement
How Do Ai Generative Features Work In Google Maps-Google Maps : గూగుల

ఏదైనా ఒక ప్రదేశంలో పురాతన కట్టడాలు, వింటేస్ ప్లేస్ లు ఎక్స్ ఫ్లోర్ చేయాలనుకుంటే.ప్లేసెస్ విత్ ఏ వింటేజ్ వైబ్స్ ( Places with a vintage vibes )తో పాటు ప్రదేశం పేరు టైప్ చేసి గూగుల్ మ్యాప్స్ లో సెర్చ్ చేయండి.అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ మ్యాప్స్ కమ్యూనిటీ నుంచి ఫోటోలు, రేటింగ్లు, రివ్యూలతో పాటు సమీపంలో ఉండే బిజినెస్, ప్లేసెస్ గురించి కావలసిన సమాచారం అంతా అందిస్తుంది.

How Do Ai Generative Features Work In Google Maps

ఫోటో కేరో సెల్స్, రివ్యూలతో పాటు క్లాతింగ్ స్టోర్స్, వినైల్ షాప్స్, ఫ్లీ మార్కెట్ లు వంటి ఆర్గనైజ్డ్ కేటగిరీలను కూడా వినియోగదారులు చూడవచ్చు.గూగుల్ మ్యాప్స్ బెస్ట్ రూట్ తో పాటు బెస్ట్ ప్లేసెస్ ను సైతం సూచించనుంది.ప్రస్తుతానికి జనరేటివ్ ఏఐ ఫీచర్లు యునైటెడ్ స్టేట్స్ లో మాత్రమే అందుబాటులోకి రానున్నాయి.

త్వరలోనే దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా ఉండే గూగుల్ మ్యాప్స్ వినియోగదారులకు ఈ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు