ఎవడు సినిమా లో ఫేస్ మారిస్తే అల్లు అర్జున్ కి రామ్ చరణ్ వాయిస్ ఎలా వచ్చింది..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ కి ( Ram Charan ) ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక మెగాస్టార్ తనయుడుగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన ఆయన తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఎవరికి లేనంత గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు.

ఇక ప్రస్తుతం ఆయన శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్( Game Changer ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో కనక తను సక్సెస్ కొట్టినట్టు అయితే తన రేంజ్ మరింత పెరుగుతుందని తెలుస్తుంది.

How Did Allu Arjun Get Ram Charan Voice In Yevadu Movie Details, Allu Arjun ,ra

ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ఎవడు ( Yevadu Movie ) అనే సినిమా చేశాడు.అయితే ఈ సినిమా అని ఫేస్ ఆఫ్ అనే సినిమా ఆధారంగా తీసిన విషయం మనకు తెలిసిందే.అంటే ఒకరు ఫేస్ ని మరొకరికి మారుస్తారు అలా ఈ సినిమాలో అల్లు అర్జున్ కు( Allu Arjun ) రామ్ చరణ్ ఫేస్ ను పెడతారు.

ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో ఒక లాజిక్ అయితే మిస్ అయిందంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది.ఎందుకంటే అల్లు అర్జున్ కి రామ్ చరణ్ ఫేస్ పెడితే చరణ్ వాయిస్ ఎందుకొస్తుంది అల్లు అర్జున్ వాయిస్ రావాలి కదా.

How Did Allu Arjun Get Ram Charan Voice In Yevadu Movie Details, Allu Arjun ,ra
Advertisement
How Did Allu Arjun Get Ram Charan Voice In Yevadu Movie Details, Allu Arjun ,Ra

మారింది ఒక ఫేసే కదా అంటూ సోషల్ మీడియాలో చాలామంది అభిమానులు ఈ సినిమా మీద కామెంట్లైతే చేస్తున్నారు.ఇక దానికి దర్శకుడు వంశీ పైడిపల్లి( Director Vamshi Paidipally ) ఏమైనా స్పందిస్తాడా లేదా అనే విషయాలకు కూడా తెలియాల్సి ఉంది.మరి అప్పుడెప్పుడో అయిపోయిన సినిమా గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు రామ్ చరణ్ కి అల్లు అర్జున్ కి మధ్య నటన పరంగా పోటీ జరుగుతుంది.

కాబట్టి వీరిద్దరూ కలిసి నటించిన ఈ సినిమా గురించి ప్రస్తావన వచ్చి ఈ టాపిక్ ను తెరపైకి తీసుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు