Chiranjeevi : తనను ఇబ్బంది పెట్టిన నిర్మాత తో చిరంజీవి ఎలా మాట్లాడాడు ?

చిన్న ఆర్టిస్ట్ నుంచి మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పుకోవచ్చు.

ప్రతిభ, స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగాడు చిరంజీవి( Chiranjeevi )40 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించాడు.

ఎమోషనల్, కామెడీ, యాక్షన్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సన్నివేశంలో అద్భుతంగా నటించ గల గొప్ప నటనా నైపుణ్యం మెగాస్టార్ సొంతమని చెప్పుకోవచ్చు.అయితే నటన విషయంలోనే కాదు వ్యక్తిగతంగా కూడా చిరంజీవి చాలా గొప్పోడు.

సినిమా సెట్ లో చిన్న ఆర్టిస్ట్ కి కూడా ఎంతో గౌరవం ఇస్తాడు.ఇక దర్శక నిర్మాతల పట్ల ఆయన చూపించే ప్రేమ, గౌరవం మాటల్లో చెప్పలేనిది.

చిరంజీవి ‘పునాది రాళ్ళు’, ‘ప్రాణం ఖరీదు’ వంటి సినిమాల్లో చిన్న పాత్రలు వేస్తూ తన సినిమా కెరీర్ ప్రారంభించాడు.ఈ హీరో 1980 వరకు పదుల సంఖ్యలో మామూలు క్యారెక్టర్స్ చేస్తూ కాలం గడిపాడు.ఆ కాలంలో చిరు ఫ్యామిలీ నెల్లూరులో నివసించేది.సినిమాల్లో బిజీ అయిపోయిన చిరును ఊరి ప్రజలకు పరిచయం చేయాలని తండ్రి వెంకట్రావు భావించారు.1980, ఆగస్టు 21న నెల్లూరులో ఒక ప్రెస్‌మీట్‌కి ఏర్పాటు చేశారు.మరుసటి రోజు అంటే ఆగస్ట్‌ 22 చిరంజీవి పుట్టినరోజు.

Advertisement

ఆ టైమ్‌లో చిరు సినిమాల్లో నటిస్తూ మద్రాసులో ఉన్నాడు.దీని గురించి తెలుసుకున్న ఈ హీరో ఆగస్టు 21 బయల్దేరి వస్తానని చెప్పాడు.

అదే సమయంలో చిరంజీవి ‘జాతర (1980)’ సినిమా( Jathara )లో హీరోగా నటించాడు.అందులో తెల్ల ప్యాంట్‌, బ్లూ షర్ట్‌ కాస్ట్యూమ్‌ చిరంజీవికి బాగా నచ్చింది.దానినే వేసుకొని ప్రెస్ మీట్ కి రావాలనుకున్నాడు.

‘జాతర’ ప్రొడ్యూసర్ రుద్రరాజు సీతారామరాజుకి ఫోన్‌ చేసి ఆ కాస్ట్యూమ్‌ తనకి ఇవ్వాలని రిక్వెస్ట్ చేశాడు.దాంతో నిర్మాత వెంటనే ఒప్పేసుకున్నాడు.

దానిని తీసుకోవడానికి చిరంజీవి సీతారామరాజు ఆఫీస్‌కి వెళ్లారు.అయితే ఈ ఆఫీస్‌లో పెట్టే టిఫిన్ తినడానికి కొంతమంది దర్శక నిర్మాతలు కూడా వచ్చారు.

నేడు ఏపీ లో ప్రధాని మోదీ ఎన్నికల టూర్ .. షెడ్యూల్ ఇదే
మహేష్ బాబు సినిమాను తక్కువ అంచనా వేసిన స్టార్ ప్రొడ్యూసర్...

వారిలో చిరంజీవిని హీరోగా పెట్టి 2 చిత్రాలు నిర్మించిన నిర్మాత కూడా ఉన్నాడు.నిర్మాత చిరంజీవి కొత్త కారుని చూసి ముచ్చటపడ్డాడు.

Advertisement

ఒక రౌండ్ వేసి వస్తాను పదినిమిషాలు కారు ఇస్తావా అని చిరంజీవిని అడిగాడు.ఆ నిర్మాతను చిరంజీవి అన్నయ్య అని ఆప్యాయంగా పిలుస్తాడు.

అలాంటి వ్యక్తి అడగడంతో వెంటనే తన కారును ఇచ్చేశాడు.అయితే పది నిమిషాల్లో వస్తానని చెప్పిన నిర్మాత రెండు గంటల వరకు రాలేదు.

దానివల్ల ప్రెస్ మీట్ మిస్ అయిపోతుందేమో అని చిరంజీవి కంగారుపడ్డాడు.రెండు గంటల తర్వాత వచ్చిన నిర్మాత "సారీ తమ్ముడు ఒక సైట్ చూద్దామని బీచ్ రోడ్ కి వెళ్లాల్సి వచ్చింది, ఏమనుకోకు" అని చెప్పాడట.

దాంతో పరవాలేదు అన్నయ్య అని చిరంజీవి నవ్వుతూ జవాబు ఇచ్చాడట. ఈ ఒక్క సంఘటనతో చిరంజీవికి నిర్మాతల పట్ల ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు.

తాజా వార్తలు