2026 ప్రపంచకప్‌కు భారత ఫుట్‌బాల్ జట్టుకు అవకాశం ఉందంట?

క్రికెట్లో మనల్ని కొట్టేవాడు లేడు.హాకీలో ఇక చెప్పాల్సిన పనిలేదు.

అయితే, ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఆదరణ ఉన్న ఫుట్‌బాల్ లో( Football ) మాత్రం భారత్ చాలా వెనుకబడి వుంది.

ఒకసారి గతాన్ని గుర్తు చేసుకుంటే, 1950లో బ్రెజిల్ వేదికగా జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ లో భారత్ కు పాల్గొనే అవకాశం వచ్చినా ఆడలేదు.

ఆ ఒక్క సందర్భం మినహా భారత ఫుట్‌బాల్ జట్టు( Indian Football Team ) ఇప్పటి వరకు ప్రపంచకప్ కు ఒక్కసారి కూడా కనీస అర్హత కూడా సాధించలేకపోయింది.అయితే, ఇప్పుడిప్పుడే భారత ఫుట్ బాల్ రాత మారుతోందని క్రీడా నిపుణులు అంటున్నారు.2014లో ఇండియన్ సూపర్ లీగ్ (ISL) ఎంట్రీతో భారత ఫుట్ బాల్ ముఖ చిత్రం క్రమేపి మారుతూ రావడం మనం గమనించవచ్చు.

అవును, మనదగ్గర కూడా ప్రతిభ ఉన్న యువ ప్లేయర్లు వస్తున్నారు ఇపుడు.ఇంతకుముందు బైచుంగ్ బుటియా,( Baichung Bhutia ) సునీల్ ఛెత్రి( Sunil Chhetri ) ఈ 2 పేర్లు మాత్రమే వినిపించేవి.కానీ ఇప్పుడు అలా లేదు.

Advertisement

గుర్ ప్రీత్ సింగ్ సంధు (గోల్ కీపర్), సందీశ్ ఝింగన్, సమద్, ఉదాంత సింగ్, లిస్టన్ ఇలా ఎందరో ట్యాలెంటెడ్ ఉన్న ప్లేయర్స్ ఐఎస్ఎల్ ద్వారా పరిచయం అయ్యారు.మంగళవారం ముగిసిన శాఫ్ ఫైనల్లో భారత జట్టు కువైట్ పై పెనాల్టీ షూటౌట్ లో నెగ్గి సౌత్ ఏసియా చాంపియన్ గా 9వసారి టైటిల్ సాధించిన విషయం విదితమే.2026లో జరిగే ఫిఫా ప్రపంచకప్ ను ( FIFA World Cup 2026 ) నార్త్ అమెరికా దేశాలు అయిన అమెరికా, కెనడా, మెక్సికోలు కలిసి ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

2022 ఖతర్ వేదికగా జరిగిన ఫుట్ బాల్ ప్రపంచకప్ లో 32 దేశాలు పాల్గొనడం జరిగింది.అయితే ఈసారి జట్ల సంఖ్యను భారీగా పెంచారు.మొత్తం 48 జట్లు పాల్గొంటున్నాయి.

ఇక్కడ క్రికెట్లో లాగా ర్యాంకింగ్స్ ఆధారంగా ప్రపంచకప్ కు అర్హత అనేది ఉండదు.ప్రతిసారి కూడా అన్ని జట్లు రెండేళ్ల పాటు క్వాలిఫయింగ్ టోర్నీలు ఆడాల్సి ఉంటుంది.

వివిధ ఖండాల్లోని వివిధ సమాఖ్యలకు ఇన్నేసి స్లాట్స్ అని ఉంటాయి.ఈసారి జట్ల సంఖ్య పెరగడంతో ఆసియాకు 8 స్లాట్లను ఇవ్వడం జరిగింది.2022 ప్రపంచకప్ లో ఈ సంఖ్య 5గా ఉంది.స్లాట్స్ సంఖ్య పెరగంతో పాటు మన జట్టు మరింత బలంగా మారడంతో ఈసారి ప్రపంచకప్ కు భారత్ క్వాలిఫై అవుతుందని దేశంలోని ఫుట్‌బాల్ అభిమానులు ఆశగా ఉన్నారు.

ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో మరొకరు లేరా..? ఆయనకి ఎందుకంత క్రేజ్...
Advertisement

తాజా వార్తలు