బోయపాటి సినిమాలో బాలయ్య ఎలా కనిపించబోతున్నాడు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

నందమూరి ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు వచ్చినప్పటికీ బాలయ్య బాబు( Nandamuri Balakrishna ) మాత్రం నటసింహంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక రెండో ఎన్టీఆర్ తర్వాత నందమూరి ఫ్యామిలీని తన ఒక్కడే తన భుజాల మీద మోసుకుంటూ వచ్చాడు.ఇక తమ అభిమానులను తను ఎప్పుడు నిరాశపరచకుండా మంచి విజయాలను అందిస్తూ వస్తున్నాడు.

ఇక ఇలాంటి క్రమం లోనే బాలయ్య బాబుని చాలా బాగా వాడుకొని మంచి సినిమాలు తీసిన దర్శకులలో బి.గోపాల్( B gopal ) ఒకరు.

కెరియర్ స్టార్టింగ్ లో లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు లాంటి సూపర్ డూపర్ సక్సెస్ లను అందించిన బి.గోపాల్ వరుస సినిమాలను బాలయ్య తోనే చేస్తూ ఆయనని స్టార్ హీరోని చేయడం లో చాలా వరకు హెల్ప్ చేశాడు.ఇక బి గోపాల్ తర్వాత బోయపాటి శీను( Boyapati Srinu ) బాలయ్య బాబుని స్టార్ హీరోగా ప్రజెంట్ చేయడంలో చాలా వరకు కీలకపాత్ర వహించాడు.

Advertisement

ఇక ఇప్పటివరకు ఆయన చేసిన మూడు సినిమాలు కూడా ఒకదానిని మించి మరొకటి సూపర్ సక్సెస్ అవడం దానికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు.ఇకవాళ్ళ కాంబినేషన్ లో ఇప్పుడు నాలుగో సినిమా కూడా వస్తుంది అయితే ఈ నాలుగో సినిమా ఎలా ఉండబోతుంది అనే అంచనాలు ఇప్పటికే ప్రేక్షకుల్లో మొదలయ్యాయి.

మరి ఈ సినిమాలో బాలయ్య బాబుని ఏ రకంగా చూపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూనే బాలయ్య బాబుని స్టార్ హీరోగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.చూడాలి మరి ఈ సినిమాలో బోయపాటి బాలయ్యను ఎలాంటి క్యారెక్టర్ లో చూపిస్తాడు అనేది.

Advertisement

తాజా వార్తలు