మేఘాలలో భయంకరమైన ఆకారాలు.. వీడియో చూస్తే వణుకు పుడుతుంది!

ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఒక వీడియో హల్‌చల్ చేస్తోంది.

మేఘాలపై నిలబడినట్లుగా కొన్ని వింత ఆకారాలు కనిపిస్తుండటంతో, ఇది ఏలియన్స్ ( Aliens )పనేనా లేక ఏదైనా మిస్టరీనా అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.

ఈ వీడియో నిజమా కాదా అని అందరూ తలలు పట్టుకుంటున్నారు.ఒక ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న వ్యక్తి ఈ వీడియో తీసినట్లు సమాచారం.

వీడియోలో మొదట మేఘాల మీద ఇద్దరు మనుషుల్లాంటి వ్యక్తులు నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది.కెమెరా తిప్పేసరికి ఇంకా చాలా ఆకారాలు కనిపిస్తాయి.

దీంతో చూసినవాళ్లంతా షాక్ అవుతున్నారు.పారానార్మల్ కంటెంట్ క్రియేటర్ మైరా మూర్( Creator Myra Moore ) ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ, "ఇక్కడేం జరుగుతోంది?" అని క్యాప్షన్ ఇచ్చారు.#aliens, #paranormal వంటి హ్యాష్‌ట్యాగ్‌లు కూడా వాడారు.

Advertisement
Horrible Shapes In The Clouds Makes You Get Shivering Video, Cloud Figures, Vira

దీంతో ఈ వీడియో తెగ వైరల్ అయిపోయింది.ఈ వీడియోకి ఎక్స్‌లో దాదాపు 50 లక్షల వ్యూస్ వచ్చాయి.

కొందరు దీన్ని ఏలియన్స్ ఉన్నారనడానికి రుజువు అంటున్నారు, మరికొందరు ఇది ఫేక్ వీడియో అని కొట్టిపారేస్తున్నారు.ఇంకొందరేమో ఇది ప్రకృతిలో జరిగే ఏదో వింత సంఘటన అయి ఉంటుందని అంటున్నారు.

Horrible Shapes In The Clouds Makes You Get Shivering Video, Cloud Figures, Vira

ఒక నెటిజన్ కెమెరా కదులుతున్న విధానాన్ని చూస్తే ఇది కావాలని చేసిన వీడియోలా ఉందని కామెంట్ చేశాడు."వాళ్లు ఆ ఆకారాలపై ఎక్కువసేపు ఫోకస్ చేయట్లేదు.ఇది ఫేక్ క్లిక్‌బైట్‌లా ఉంది" అని అన్నాడు.

ఇంకొకరు మంచుతో కప్పబడిన నేలపై మనుషులుంటే, వాటిని మేఘాలుగా భ్రమపడి ఉంటారని చెప్పారు.వీడియోలో ఫ్లైట్ ఎందుకు కదలకుండా ఒకేచోట ఉందని కూడా చాలా మంది ప్రశ్నించారు.

కైలాస పర్వతం గురించి ఈ విషయాలు తెలిస్తే .. శివుడు ఉన్నాడని నమ్మాల్సిందే

నిజంగా అలాంటి వింత చూస్తే వీడియో తీసేవాళ్లు జూమ్ చేసి క్లియర్‌గా చూపించేవాళ్లని అంటున్నారు.

Horrible Shapes In The Clouds Makes You Get Shivering Video, Cloud Figures, Vira
Advertisement

కొంతమంది నిపుణులు మాత్రం దీనికి లాజికల్ రీజన్స్ ( Logical Reasons )చెబుతున్నారు.మేఘాల కింద ఉన్న ఫ్యాక్టరీల నుంచి వచ్చే ఆవిరి ఇలా కనిపిస్తుందని ఒకరు అన్నారు.ఒక పైలట్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ, పొగ గొట్టాల నుంచి వచ్చే పొగ లేదా కూలింగ్ టవర్ల నుంచి వచ్చే ఆవిరి పొగమంచు పొరపైకి వెళ్లడం వల్ల ఇలాంటి ఆకారాలు ఏర్పడతాయని వివరించారు.

మొత్తానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

తాజా వార్తలు