చ‌లికాలంలో చ‌ర్మాన్ని మెరిపించే హోం మేడ్ సీరం.. రోజు వాడితే ఎన్నో లాభాలు!

చలికాలం రానే వచ్చింది.ఈ సీజన్‌లో చలిపులి మాత్రమే కాదు ఎన్నో చర్మ సమస్యలు సైతం తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి.

ముఖ్యంగా చలికాలంలో చర్మం పొడిగా మారడం, నిర్జీవంగా త‌యార‌వ‌డం, చర్మం యొక్క నిగారింపు తగ్గిపోవడం వంటివి జరుగుతుంటాయి.అయితే ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టి చలికాలంలో చర్మాన్ని అందంగా మెరిపించడానికి ఇప్పుడు చెప్పబోయే సీరం అద్భుతంగా సహాయపడుతుంది.

మరి ఇంతకీ ఆ సీరం ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యాన్ని వేసి వాటర్ తో ఒకటి రెండు సార్లు కడగాలి.

ఆ తర్వాత అందులో ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ తో సహా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి రైస్ జ్యూస్ ను స్టైనర్ సహాయంతో సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు మ‌రో బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ ను వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, రెండు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్, రెండు చుక్కలు టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇక చివరగా అందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు రైస్ జ్యూస్ ను వేసి మ‌రో నాలుగైదు నిమిషాల పాటు కలుపుకుంటే మన సీరం సిద్ధం అవుతుంది.

ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఈ సీరంను ముఖానికి అప్లై చేసుకుని పడుకోవాలి.ప్రతిరోజు ఈ సీరంను వాడటం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.

నిర్జీవంగా మారిన‌ చర్మం మళ్లీ కాంతివంతంగా మరియు నిగారింపుగా మారుతుంది.అంతేకాదు ఈ సీరంలో వాడటం వల్ల చర్మంపై ముడతలు, మచ్చలు ఏమైనా ఉంటే తగ్గుముఖం పడతాయి.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

స్కిన్ స్మూత్ అండ్ సాఫ్ట్ గా సైతం మారుతుంది.కాబట్టి తప్పకుండా ఈ సీరంను తయారు చేసుకుని ఉపయోగించేందుకు ప్రయత్నించండి.

Advertisement