ఈ రోజుల్లో చాలా మంది జుట్టుకు సంబందించిన సమస్యలను ఎదుర్కొంటున్నారు.వాటిలో ప్రదానంగా తలలో జిడ్డు సమస్య.
ఈ సమస్య తలలోని చర్మ గ్రందుల్లో అధికంగా నూనె ఉత్పత్తి కావటం వలన వస్తుంది.ఈ సమస్య నుండి బయట పడటానికి ఖరీదైన సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించ వలసిన అవసరం లేదు.
ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే ఆ సమస్య నుండి సులభంగా బయట పడవచ్చు.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
జుట్టును తడిగా ఉన్నప్పుడు దువ్వెనతో దువ్వకూడదు.అలాగే ఎక్కువ వేడిని కలిగించే డ్రైయర్స్ వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి.జుట్టును ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
వారానికి రెండు సార్లు తలస్నానము తప్పనిసరిగా చేయాలి.గుడ్డు తెల్లసొన జుట్టు సమస్యలకు మంచి పరిష్కారాన్ని చూపుతుంది.
జుట్టు సమస్యలకు గుడ్డు తెల్లసొనను చాలా పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు.తెల్లసొనలో ఉండే ప్రోటీన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు తలపై ఉన్న జిడ్డును చాలా సమర్ధవంతంగా తొలగిస్తుంది.
గుడ్డు తెల్లసొనను తలకు బాగా పట్టించి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానము చేస్తే త్వరలోనే జిడ్డు సమస్య తొలగిపోతుంది.జిడ్డు సమస్యకు ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా బాగా పనిచేస్తుంది.
ఒక కప్పు నీటిలో రెండు స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి అరగంట అయ్యాక తలస్నానము చేయాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy