గోర్లు సహజంగా పెరగాలంటే ఇంటి చిట్కాలు

గోర్లు తొందరగా చిట్లి పోతున్నాయా? గోర్లలో త్వరగా పెరుగుదల కనపడటం లేదా? గోర్లు బలంగా అందంగా పెరగాలంటే కొన్ని చిట్కాలతో పాటు పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి.

అప్పుడే గోళ్లు బలంగా చిట్లిపోకుండా పెరుగుతాయి.

అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే గోళ్లను కొరకకూడదు.ఈ అలవాటు ఉంటే వెంటనే మానేయటం మంచిది.

ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే గోళ్లు వేగంగా పెరుగుతాయి.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

నిమ్మకాయ మరియు కొబ్బరి నూనె నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ పాలిపోయిన గోర్లను ఆరోగ్యంగా చేయటంలో సహాయపడుతుంది.కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ గోళ్లకు అవసరమైన పోషణను ఇచ్చి బలంగా ఉండేలా చేస్తుంది.ఒక స్పూన్ కొబ్బరి నూనెలో 5 చుక్కల నిమ్మరసం వేసి మైక్రో ఒవేన్ లో ఒక సెకన్ వేడి చేయాలి.

Advertisement

ఈ మిశ్రమాన్ని గోళ్లకు రాసి మసాజ్ చేస్తే గోళ్లు విరిగిపోకుండా బలంగా పెరుగుతాయి.నారింజ రసం నారింజ రసంలో ఫోలిక్ యాసిడ్ తో పాటు విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన గోళ్ళ పెరుగుదలలో కీలకమైన పాత్రను పోషిస్తాయి.

నారింజ రసంలో గోళ్ళను ముంచి 5 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తర్వాత శుభ్రంగా కడగాలి.గోర్లను పొడి టవల్ తో తుడుచుకొని మాయిశ్చరైజర్ రాయాలి.ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.

Advertisement

తాజా వార్తలు