చిగుళ్ల నుంచి రక్తస్రావ‌మా? క‌ల‌బంద‌తో నివారించుకోండిలా!

చిగుళ్ల నుంచి ర‌క్త‌స్రావం.పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మందిలో ఈ స‌మ‌స్య క‌నిపిస్తుంటుంది.

బ్యాక్టీరియా, నోటి శుభ్ర‌త లేక‌పోవ‌డం, హార్మోన్ల మార్పులు, ఆహార‌పు అల‌వాట్లు, మ‌ధుమేహం, ధూమ‌పానం, పోష‌కాల లోపం, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం ఇలా ర‌క‌ర‌కాల కారణాల వ‌ల్ల చిగుళ్ల నుంచి ర‌క్తం వ‌స్తుంటుంది.దాంతో ఈ స‌మ‌స్య‌ను ఎలా నివారించుకోవాలో తెలియ‌క తెగ స‌త‌మ‌తమైపోతుంటారు.

అయితే ఇంట్లోనే కొన్ని సింపుల్ టిప్స్ పాటించ‌డం ద్వారా ఈ స‌మ‌స్య‌ను సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు.మ‌రి ఆ టిప్స్ ఏంటో చూసేయండి.

చిగుళ్ల ర‌క్త‌స్రావాన్ని అర‌క‌ట్ట‌డంలో క‌ల‌బంద అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.అవును, క‌ల‌బంద నుంచి జెల్ తీసుకుని.చిగుళ్ల‌పై అప్లై చేసి కాసేపు మెల్ల మెల్ల‌గా రుద్దుకోవాలి.

Advertisement

ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే.

క‌ల‌బంద‌లో ఉండే యాంటీ ఇంఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్ గుణాలు చిగుళ్ల నుంచి రక్త‌స్రావాన్ని నివారించి చిగుళ్ల‌ను బ‌లంగా మారుస్తాయి.నువ్వుల నూనెతో కూడా ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

రెండు స్పూన్ల నువ్వుల నూనెను నోట్లో వేసుకుని.మింగ‌కుండా బాగా పుక్క‌లించాలి.

ఆ త‌ర్వాత నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు ఉద‌యం, సాయంత్రం చేస్తూ చిగుళ్ల నుంచి ర‌క్తం రాకుండా ఉంటుంది.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
ఆలు తొక్కతో ఇలా చేస్తే‌ అందంగా మెరిసిపోవ‌చ్చు!!

అలాగే ర‌క్త‌స్రావాన్ని అరిక‌ట్టి చిగుళ్ల‌ను దృఢంగా మార్చ‌డంలో దాల్చిన చెక్కా గ్రేట్‌గా స‌హాయ‌ ప‌డుతుంది.దాల్చిన చెక్క‌ను మెత్త‌గా పొడి చేసి.అందులో కొద్దిగా వాట‌ర్ వేసి పేస్ట్‌లా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని చిగుళ్ల‌పై అప్లై చేసుకుని.ఐదు లేదా ప‌ది నిమిషాల అనంత‌రం నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి.

ఇలా రోజుకు ఒక సారి చేసినా కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.

తాజా వార్తలు