కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేశారంటే నరఘోష శత్రు బాధలు తొలగిపోతాయని తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఏడాది కార్తీక మాసంలో( Karthika Masam ) కార్తిక పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైనదని దాదాపు చాలా మందికి తెలుసు.

ఈ రోజు శైవ దేవాలయాలలో సాయంత్రం వేళ జ్వాలాతోరణం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో భక్తులు అంతా పాల్గొనాలని పండితులు చెబుతున్నారు.అసలు ఈ జ్వాలాతోరణం ఏంటి? దీన్ని ఎందుకు నిర్వహిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ఒకసారి పరమేశ్వరుడు( Parameshwara ) త్రిపురసురలను చంపేందుకు వెళ్తాడు.

అలా వెళ్ళినా పరమ శివుడు ఎంతటికి తిరిగిరాడు.దాంతో ఆయన కోసం ఎదురు చూసి ఆవేదన చెందిన పార్వతి దేవి( Parvati Devi ) జ్వాల ను ఏర్పాటు చేసి అందులో దూకాలని అనుకుంటుంది.

History Importance And Significance Of Karthika Pournami Details, Karthika Pour

సరిగ్గా ఆమె దూకే సమయంలో త్రిపురాసులను చంపేసి శివుడు తిరిగి వస్తాడు.దాంతో ఆమె అగ్నిలోకి దుకాకుండా ఆగిపోతుంది.ఆమె రగిలించిన అగ్నిని పరమేశ్వరుడు తోరణంలా చేస్తాడు.

Advertisement
History Importance And Significance Of Karthika Pournami Details, Karthika Pour

ఆ తర్వాత పార్వతి పరమేశ్వరులు ఆ జ్వాలా తోరణం చుట్టూ మూడు సార్లు ప్రదక్షణ చేస్తారు.ఇలా జ్వాలా తోరణం ప్రత్యేకమైనదిగా నిలిచింది.

అలాగే కార్తీక పౌర్ణమి( Karthika Pournami ) రోజు శివుడి ఆలయాలలో స్తంభాలకు భక్తులు గడ్డితో తోరణాలు ఏర్పాటు చేస్తారు.అలాగే వాటికి నూనెలో ముంచిన వస్త్రాలను తగిలించి వెలిగిస్తారు.

History Importance And Significance Of Karthika Pournami Details, Karthika Pour

భక్తులు ఎవరైతే జ్వాలాతోరణాన్ని ( Jwala Thoranam ) దర్శించుకుని దాని చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తారో వారికి నర దృష్టి, దోషం, శత్రు బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే సంవత్సరం అంతా దీపం వెలిగించక పోయినా పర్వాలేదు కానీ ఈ రోజు మాత్రం కచ్చితంగా 365 వత్తుల దీపాన్ని వెలిగించాలని పండితులు చెబుతున్నారు.ఇలా చేయడం వల్ల వెలిగించిన వారి కుటుంబ సభ్యులకి ఎంతో మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025
Advertisement

తాజా వార్తలు